iDreamPost
android-app
ios-app

నేను మద్యానికి బానిసనయ్యా.. తాగుబోతు అంటూ తిట్టారు: స్టార్ హీరోయిన్

  • Published Apr 26, 2024 | 4:07 PM Updated Updated Apr 26, 2024 | 4:07 PM

నటులే కాదు... నటీమణులు సైతం మద్యానికి బానిస అవుతున్నారు. సమస్యలు, టెన్షన్స్, ఒత్తిడికి గురై మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే బహిరంగంగా ఎవ్వరూ బయటపడరు. కానీ ఈ నటి ఓపెన్ కామెంట్స్ చేసింది.

నటులే కాదు... నటీమణులు సైతం మద్యానికి బానిస అవుతున్నారు. సమస్యలు, టెన్షన్స్, ఒత్తిడికి గురై మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే బహిరంగంగా ఎవ్వరూ బయటపడరు. కానీ ఈ నటి ఓపెన్ కామెంట్స్ చేసింది.

  • Published Apr 26, 2024 | 4:07 PMUpdated Apr 26, 2024 | 4:07 PM
నేను మద్యానికి బానిసనయ్యా.. తాగుబోతు అంటూ తిట్టారు: స్టార్ హీరోయిన్

మద్యానికి బానిసైతే జీవితం బుగ్గిపాలు అవుతుందని చెప్పేందుకు రియల్ లైఫ్ సంఘటనలు అనేకం ఉన్నాయి. మద్యం కేవలం సామాన్యులే కాదు.. సెలబ్రిటీలను అతలాకుతలం చేసింది. ఎస్ వి రంగారావు, హరినాథ్ వంటి దిగ్గజ నటులు దీనికి బానిసయ్యే జీవితాన్నే కాదు.. ప్రాణాలను కోల్పోయారని టాక్ నడుస్తూనే ఉంది. నటులే కాదు.. నటీమణులు సైతం దీని బారిన పడిన వారే. అలనాటి మేటి నటి.. తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ తారామణి మహా నటి సావిత్రి కూడా అతిగా మద్యం సేవించి కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్ పాడుచేసుకుందని చెబుతుంటారు. దీన్నే మహా నటి సినిమాలో దర్శకుడు చూపించాడు. ఇప్పుడు తాను దీనికే బలయ్యాను అంటోంది ప్రముఖ నటి.

ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పూజా భట్. కేవలం నటి మాత్రమే కాదు.. తండ్రి దారిలోనే వెళుతుంది. నిర్మాత, దర్శకురాలిగా కొనసాగుతుంది. అయితే తాజాగా టిప్సీ అనే బాలీవుడ్ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన పూజా మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో తాను మద్యానికి బానిసనయ్యానంటూ చెప్పుకొచ్చింది. దాదాపు ఏడున్నరేళ్ల పాటు దానితో సహజీవనం చేశానని, వ్యసనంలా మారిపోయిందని తెలిపింది. 44 ఏళ్ల వయస్సులో దాన్ని వదిలించుకున్నట్లు తెలిపింది. అది చెప్పుకోవడానికి మేం సిగ్గు పడటం లేదని పేర్కొంది. బహిరంగంగానే పలు విషయాలు వెల్లడించింది పూజా భట్.

Pooja bhatt addicted to alcohol

‘మేం ఆడవాళ్లం .. అయినా తాగుతాం. మాకు చాలా సమస్యలుంటాయి. ఒంటరితనం, బాధ వంటివి ఎక్స్ పీరియన్స్ చేస్తాం. ఎక్కువ ఒత్తిని ఎదుర్కొంటాం. వీటి నుండి బయటపడేందుకు మద్యానికి బానిస అవుతున్నాం. ఒక్కో సమయంలో నన్ను తాగుబోతు అని పిలిచారు. అప్పుడే మద్యం మానేయాలని నిర్ణయించుకున్నా. నేను మానేశాను. దీని కోసం పెద్ద పోరాటమే చేశాను. అయితే మేము త్వరగానే బయటపడుతున్నాం. ఆ అలవాటు నుండి బయటపడకపోతే వినాశనాన్ని కొని తెచ్చకున్నట్లే. అలాగే ఇలాంటి సినిమాలు ఆడవాళ్ల కోణం నుండి తీయడం చాలా హ్యాపీగా ఉంది’ అని చెప్పుకొచ్చింది నటి. ప్రస్తుతం ఆమె తన ఫ్రెండ్ దీపక్ తిజోరీ దర్శకత్వంలో నటిస్తున్న టిప్సీలో నటిస్తోంది. సడక్, జానమ్, జునూన్, హమ్ దోనో, గుణఘర్, అంగ్రాక్షక్, చాహత్, తమన్నా, బోర్డర్, జఖ్మ్, సడక్ 2 వంటి చిత్రాలతో అలరించింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet