iDreamPost
android-app
ios-app

బన్నీ బ్రాండింగ్ ను బీ టౌన్ వాడుకుంటుందా..!

  • Published Oct 29, 2024 | 1:48 PM Updated Updated Oct 29, 2024 | 1:48 PM

Pushpa 2 Updates: పుష్ప రాజ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలియనిది కాదు. ఈ క్రమంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2 గురించే డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సౌత్ కంటే కూడా నార్త్ లోనే బన్నీ కి బాగా క్రేజ్ దక్కుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు అదే క్రేజ్ ను వాడుకునే ప్రయత్నంలో ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Pushpa 2 Updates: పుష్ప రాజ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలియనిది కాదు. ఈ క్రమంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2 గురించే డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సౌత్ కంటే కూడా నార్త్ లోనే బన్నీ కి బాగా క్రేజ్ దక్కుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు అదే క్రేజ్ ను వాడుకునే ప్రయత్నంలో ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 29, 2024 | 1:48 PMUpdated Oct 29, 2024 | 1:48 PM
బన్నీ బ్రాండింగ్ ను బీ టౌన్ వాడుకుంటుందా..!

అమలాపురం నుంచి ఆస్ట్రేలియా వరకు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. బందర్ నుంచి బాలీవుడ్ వరకు.. ఇప్పుడు అందరి చూపులు బన్నీ మీదే ఉన్నాయి. పుష్ప తర్వాత బన్నీ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సౌత్ కు మించిన క్రేజ్ పుష్ప కు నార్త్ లో ఏర్పడింది. దీనితో ఇప్పుడు పుష్ప 2 మీద అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు ప్రతి రోజు వచ్చే అప్డేట్స్ ప్రేక్షకులను ఇంకాస్త ఊరిస్తున్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మూవీ టీం కూడా ప్రమోషన్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. మరో వారంలో షూట్ కంప్లీట్ అవుతుంది. సో ఇక ప్రమోషన్స్ , సాంగ్ , ట్రైలర్ రిలీజ్ అని.. సోషల్ మీడియా మొత్తం పుష్ప రాజ్ ఆక్రమించడానికి రెడీ అవుతున్నాడు. ఇక నార్త్ ప్రమోషన్స్ విషయానికొస్తే ఆల్రెడీ అక్కడ బన్నీ మ్యానియా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు నార్త్ లో బన్నీ బ్రాండింగ్ ను బాగా వాడేసుకుంటున్నారు.

భూల్ భూలయ్యా సిరీస్ లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ గా మరో మూవీ ఈ దీపావళికి రానుంది. ఈ సినిమాకు అనీల్ తడానీ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే నార్త్ లో పుష్ప 2 మూవీ ని డిస్ట్రిబ్యూట్ చేసేది కూడా అనీల్ తడానీ నే. ఈ క్రమంలో భూల్ భూలయ్యా మూవీ రిలీజ్ కాబోతున్న సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో 30 అడుగుల పుష్ప కట్ అవుట్ ను పెట్టిస్తానని మాట ఇచ్చారట అనీల్. సో ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా పుష్ప 2 పుణ్యమా అని భూల్ భూలయ్యా కు హైప్ దక్కుతుంది. మొత్తానికి బాలీవుడ్ లో బన్నీ బ్రాండింగ్ ను బాగానే యూస్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో తెలియనిది కాదు. అక్కడి వారు సక్సెస్ రేట్ చూసి చాలా కాలమే అయింది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఆ మాత్రమైనా నిలబడింది అంటే.. అది మన పాన్ ఇండియా స్టార్స్ వలెనే. ఇప్పుడు ఆ లిస్ట్ లో బన్నీ పేరు కూడా యాడ్ అవ్వబోతుంది.

సౌత్ లో పుష్పరాజ్ ఎంత కలెక్ట్ చేస్తాడు అనే ఇంట్రెస్ట్ కంటే కూడా.. నార్త్ లో ఎంత వసూళ్లు చేస్తాడు అనే దానిపైనే అందరి ఫోకస్ ఉంది. ఇలా సౌత్ టు నార్త్ బన్నీ క్రియేట్ చేసే రికార్డ్స్ కోసం అందరు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప పార్ట్ 1 తో సుకుమార్ ఏం మ్యాజిక్ చేశాడో తెలియదు. ఇప్పుడు అదే పుష్ప 2 పాలిట అదృష్టంగా మారింది. ఎలా అయినా సరే బన్నీ కుంభస్థలాన్ని బద్దలుకొడతాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఫ్యాన్స్ అయితే సినిమాను హిట్ చేయడానికి రెడీగా ఉన్నారు.. ఇక మేకర్స్ రిలీజ్ చేయడమే బ్యాలెన్స్. ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss