iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ షోపై అల్లు అర్జున్ నటి సంచలన వ్యాఖ్యలు

  • Published Oct 31, 2023 | 3:32 PM Updated Updated Oct 31, 2023 | 3:32 PM

రియాలిటీ షో టీవీల్లో నడుస్తున్న కార్యక్రమం బిగ్ బాస్. ఇంచు మించు అన్నీ భాషల్లోనూ ఈ షో నడుస్తోంది. ఈ షోకు ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే బిగ్ బాస్ షోను వ్యతిరేకించే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఈ షో గురించి ఓ నటి కీలక వ్యాఖ్యలు చేసింది.

రియాలిటీ షో టీవీల్లో నడుస్తున్న కార్యక్రమం బిగ్ బాస్. ఇంచు మించు అన్నీ భాషల్లోనూ ఈ షో నడుస్తోంది. ఈ షోకు ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే బిగ్ బాస్ షోను వ్యతిరేకించే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఈ షో గురించి ఓ నటి కీలక వ్యాఖ్యలు చేసింది.

  • Published Oct 31, 2023 | 3:32 PMUpdated Oct 31, 2023 | 3:32 PM
బిగ్ బాస్ షోపై అల్లు అర్జున్ నటి సంచలన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ దూసుకెళ్లిపోతూ ఉంది. అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌తో సంచలనం సృష్టిస్తుంది. ఈ షోపై జనాల్లో భిన్న అభిప్రాయాలున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఛీకొట్టినవాళ్లు ఉన్నట్లే.. ఆదరిస్తున్న వాళ్లు ఉన్నారు. ఈ షో వచ్చినప్పుడు మాత్రమే టీవీ చూసేటోళ్లు కూడా ఉండొచ్చు. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కాంట్రవర్సీ షో.. ఇప్పుడు ఏడవ సీజన్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఉల్టా పల్టా అనే కొత్త కాన్సెప్ట్‌తో ఈ సీజన్ -7 తీసుకొచ్చారు. ఇక కంటెస్టెంట్లు తమదైన స్టైల్లో ఆడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ షోపై ఘాటు వ్యాఖ్యలు చేసిందీ కాంట్రవర్సీ క్వీన్. ఆమె మరెవ్వరో కాదూ.. వరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భానుశ్రీ మెహ్రా.

 ఈ షోను ఆపేయాలంటూ గతంలో చాలా మంది సామాజిక కార్యకర్తలు కోర్టు మెట్లెక్కారు కూడా. ఎప్పుడు కాంట్రవర్సీలతో నడిచే ఈ షోపై భాను కీలక వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షోని జనాలు ఎలా చూస్తున్నారో తనకు ఇప్పటికీ అర్థం కాకపోగా.. ఆశ్చర్యమేస్తుందని అన్నారు. ఎప్పటికప్పుడు కొత్త సీజన్లు రావడమేంటోనని సందేహం వ్యక్తం చేశారు. తన అభిప్రాయం ప్రకారం.. టీవీలో అత్యంత చెత్త షో అంటూ తిట్టి తిట్టనట్లు తిట్టారు. తన ఇన్ స్టా గ్రామ్ ఫీడ్ అంతా బిగ్ బాస్ హైలెట్స్‌తో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిందీ ఈ భామ. అయితే ఆమె ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయడం కొత్త కాదు. గతంలో అల్లుఅర్జున్ తన ఖాతాను బ్లాక్ చేశాడంటూ హంగామా చేసిన సంగతి విదితమే.

వరుడు సినిమాలో ఆమె ఫేస్ రివీల్ చేయకుండా.. థియేటర్లలో ఆమెను చూడాలంటూ..విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆ ప్లాన్ బెడిసికొట్టింది. అయితే ఆ సినిమా ప్లాప్ మూటగట్టుకోవడంతో ఆమెకు ఛాన్సులు నిల్ అయ్యాయి. డింగ్ డాల్ బెల్, అలా..ఎలాలో చిన్న పాత్రలో కనిపించింది. గోవిందుడు అందరివాడేలే, రన్, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, 10th క్లాస్ డైరీస్, మిస్ ఇండియా సినిమాల్లో కూడా మెరిసింది. అయితే ఏ సినిమాను ఆమెకు ప్లస్ కాలేదు. హీరోయిన్ వేషాలు ఆమెకు రాకపోవడంతో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. లియోలో కూడా ఓ చిన్న పాత్రలో మెరిసింది ఈ అమ్మడు. మరీ ఇప్పుడు ఈ షోపై ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారి తీస్తుందో వేచి చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom