iDreamPost
android-app
ios-app

దేవర సినిమా కోసం అల్లు అర్హ షాకింగ్‌ రెమ్యూనరేషన్‌!

  • Published Jul 16, 2023 | 4:51 PM Updated Updated Jul 16, 2023 | 4:51 PM
  • Published Jul 16, 2023 | 4:51 PMUpdated Jul 16, 2023 | 4:51 PM
దేవర సినిమా కోసం అల్లు అర్హ షాకింగ్‌ రెమ్యూనరేషన్‌!

సినిమా ఇండస్ట్రీలో హీరో,హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో.. వారి పిల్లలకి కూడా అంతే క్రేజ్ ఉంటుంది. స్టార్‌ కిడ్స్‌గా వారు కూడా సినిమాల్లోకి అడుగు పెట్టడం కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా ఎంతో మంది సెలెబ్రిటీల పిల్లలు హీరో,హీరోయిన్లుగా , డైరెక్టర్స్‌గా , ప్రొడ్యూసర్లుగా తమకు ఇష్టమైన క్రాఫ్ట్‌లో దూసుకెళ్తూ ఉంటారు. ఇదే బాటలో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కూతురు సితార కూడా సినిమా అనుబంధం రంగంలో రాణిస్తోంది. తాజాగా, ఆమె ఓ నగల యాడ్ నటించారు. అది సితార మొదటి యాడ్‌.

మొదటి యాడ్‌కే సితార కోటి రూపాయిల పారితోషికాన్ని తీసుకున్నట్లు సమాచారం. ఇక, ఆ డబ్బునంతా తన తండ్రి చారిటీకి ఇచ్చేసినట్లు తెలిపింది. సితార బాటలోనే అల్లు అర్జున్‌ కూతురు అర్హ కూడా నటన వైపు వచ్చింది. సమంత నటించిన శాకుంతలంలో భరతుడిగా నటించి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. శాకుంతలంలో అర్హనే మెయిన్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో కూడా అర్హ నటించనున్నట్లు తెలుస్తోంది.

దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అర్హ జాన్వీ చిన్ననాటి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఈ షూటింగ్ జరగబోతుందట. ఇందులో అర్హ రెమ్యూనరేషన్ నిమిషానికి రెండు లక్షలు అని టాక్. సినిమాలో ఆమె స్క్రీన్ టైం 10 నిముషాలు … అంటే మొత్తం సినిమాకి 20 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్‌ తీసుకోనుంది. ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. మరి, దేవర సినిమా కోసం అల్లు అర్హ 20 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్‌ తీసుకుందన్న వార్తలపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet