iDreamPost
android-app
ios-app

‘జైలర్‌’సినిమా విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు!

  • Published Aug 31, 2023 | 2:07 PM Updated Updated Aug 31, 2023 | 2:07 PM
  • Published Aug 31, 2023 | 2:07 PMUpdated Aug 31, 2023 | 2:07 PM
‘జైలర్‌’సినిమా విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు!

తమిళ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌- సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కాంబోలో ‘జైలర్‌’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజాగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన అన్ని భాషల్లో సూపర్‌ హిట్‌ అయింది. ఇప్పటి వరకు దాదాపు 700 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇక, ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. జైలర్‌ సినిమాలో విలన్‌ పాత్రలో నటించిన ‘వినాయకన్‌’ పేరు మారుమోగింది. ఆయన గతంలో చాలా సినిమాలు చేసినా.. ముందెన్నడూ రాని గుర్తింపు ఇప్పుడు వచ్చింది.

సోషల్‌ మీడియాలో వినాయకన్‌ వీడియోలు గత కొద్దిరోజుల నుంచి వైరల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ వార్త సంచలనానికి తెరతీసింది. వినాయకన్‌పై ప్రముఖ మోడల్‌ మృదులా దేవి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తనను తన తల్లిని రూముకు రావాలంటూ వినాయకన్‌ వేధింపులకు గురి చేసినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మంచి స్థాయిలోకి వెళుతున్న నేపథ్యంలో ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావటం చర్చనీయాంశంగా మారింది.

ఈ ఆరోపణలపై వినాయకన్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. కాగా, వినాయకన్‌ 1995లో వచ్చిన మాంత్రికమ్‌ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2006లో వచ్చిన ‘అసాధ్యుడు’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు. ప్రస్తుతం తమిళంలో ‘ధ్రువనక్షిత్రం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. మరి, వినాయకన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş