Akkineni Nagarjuna: బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని కలిసిన కింగ్ నాగార్జున.. ప్రశంసిస్తోన్న నెటిజన్లు

Akkineni Nagarjuna బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని కలిసిన కింగ్ నాగార్జున.. ప్రశంసిస్తోన్న నెటిజన్లు

Akkineni Nagarjuna కుబేర షూటింగ్ నిమిత్తం ఇటీవల నాగార్జున, ధనుష్ ముంబయికి చేరుకున్న సంగతి విదితమే. ఆ సమయంలో ముంబయి విమానాశ్రయంలో ఓ అభిమాని నాగార్జునతో ఫోటో దిగేందుకు ముందుకు రాగా, ఆయన బాడీగార్డ్ తోసేసిన సంగతి విదితమే. ఇప్పుడు..

Akkineni Nagarjuna కుబేర షూటింగ్ నిమిత్తం ఇటీవల నాగార్జున, ధనుష్ ముంబయికి చేరుకున్న సంగతి విదితమే. ఆ సమయంలో ముంబయి విమానాశ్రయంలో ఓ అభిమాని నాగార్జునతో ఫోటో దిగేందుకు ముందుకు రాగా, ఆయన బాడీగార్డ్ తోసేసిన సంగతి విదితమే. ఇప్పుడు..

టాలీవుడ్ వర్సటైల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం కుబేర. ధనుష్ హీరోగా నటిస్తుండగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్. కింగ్ నాగార్జున కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలోని పలు ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఇటీవల జూహు బీచ్‌లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుబేర ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ధనుష్‌తో పాటు నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి విదితమే. ఇందులో ధనుష్ మాసిన బట్టలు, చింపిరి జుట్టు, గుబురుగా పెంచిన గడ్డంతో కనిపించి సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ చేశాడు.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమా షూటింగ్ నిమిత్తం నాగార్జున, ధనుష్ ముంబయికి చేరుకోగా.. ఓ దివ్యాంగుడైన అభిమాని కింగ్ వద్దకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆయన బాడీగార్డు అత్యుత్సాహం ప్రదర్శించి అతడ్ని పక్కకు నెట్టివేశాడు. అయితే అభిమాని తమాయించుకుని నిలబడ్డాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో.. నాగార్జునపై విమర్శలు మొదలు పెట్టారు. ఈ విషయం నాగ్ దృష్టికి వెళ్లడంతో ఆయన సోషల్ మీడియా ఖాతా ద్వారా క్షమాపణలు తెలియజేశాడు. ఆ వ్యక్తికి సారీ చెప్పిన కింగ్.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే కుబేర షూటింగ్ పూర్తి చేసుకుని ముంబయికి బయలు దేరాడు నాగ్. ఈ సారి ముంబయి ఎయిర్ పోర్టుకు రాగానే… తన అభిమానిని కలిశాడు.

హైదరాబాద్ వెళ్లేందుకు ముంబయి విమానాశ్రయానికి వచ్చిన నాగ్.. అప్పుడు తన బాడీ గార్డ్స్ తోసేసిన అభిమానిని అక్కున చేర్చుకున్నాడు. అతనిని దగ్గర తీసుకుని మాట్లాడాడు. నాగ్ దగ్గర తీసుకోవడంతో ఫ్యాన్ పొంగిపోయాడు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు ఆ దివ్యాంగుడైన అభిమాని. కాగా, ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీంతో అప్పట్లో నాగ్ చూడలేదని, ఏమైంది హ్యూమానిటీ అంటూ తిట్టిపోసిన నెటిజన్లు.. ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మా నాగ్ మామ ది గోల్డెన్ హార్ట్ రా అంటూ ప్రశంసిస్తున్నారు. ఏదైనా ఫ్యాన్స్ అభిమానమే వేరప్పా.. అనిపించకమానదు.. ఏంటో ఈ  అభిమానులు ఏదీ వచ్చినా తట్టుకోలేరు అనిపిస్తుంది.

Show comments