Swetha
బుల్లితెర ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది బిగ్ బాస్. ఈ రియాలిటీ షో వరుసగా 8 సీజన్స్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు 9 వ సీజన్ కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సీజన్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. అదేంటో చూసేద్దాం.

తెలుగు రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ సీజన్ మొదలైన దగ్గర నుంచి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ చేయకుండా చూసేవాళ్లు ఎంతో మంది. అలాగే బిగ్ బాస్ తర్వాత ఎంతో మంది పార్టిసిపెంట్స్ జర్నీ కూడా మలుపు తిరిగిందని చెప్పి తీరాల్సిందే. ఒక్కసారి సీజన్ స్టార్ అయిందంటే ఇక సోషల్ మీడియాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ మొదలవుతుంది.. దీని మీద మీమ్స్ , ట్రోల్స్,రివ్యూలు ఇలా ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళది. అయితే ఇప్పుడు ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా 8 సీజన్స్ ను పూర్తిచేసుకుని 9 వ సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఈ సీజన్ లో ఎవరు హోస్ట్ గా ఉండబోతారా ? ఎలాంటి కంటెస్టెంట్స్ రాబోతున్నారా ? అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో హోస్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.
అదేంటంటే బిగ్ బాస్ సీజన్ 9 లో హోస్ట్ మారబోతున్నారని. . అక్కినేని నాగార్జున ప్లేస్ లో బాలకృష్ణ ఈ సీజన్ ను హోస్ట్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ అటు బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సీజన్ హోస్ట్ ను ఫిక్స్ చేశారట. ఈ సీజన్ లో కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కోట్ చేసిన రెమ్యునిరేషన్ ఇచ్చేనందుకు నిర్వాహకులు ఒకే చెప్పారని ఇన్సైడ్ టాక్. సో దాదాపు మరోసారి నాగ్ ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లే. ఈ 9 వ సీజన్ ను సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. సో ఈసారి ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తారో.. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .