iDreamPost
android-app
ios-app

Akhil Agent Look: ఏజెంట్‌లోని అఖిల్ లుక్ జాన్ స్నోలా ఉందేంటి?

  • Published May 30, 2022 | 5:09 PM Updated Updated May 30, 2022 | 5:09 PM
  • Published May 30, 2022 | 5:09 PMUpdated May 30, 2022 | 5:09 PM
Akhil Agent Look: ఏజెంట్‌లోని అఖిల్ లుక్ జాన్ స్నోలా ఉందేంటి?

హీరోయిక్ గా అఖిల్ నిటిస్తున్న సినిమా ఏజెంట్ ని ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ తోపాటు, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌ 12న రిలీజ్. కులు మనాలీలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీన్స్‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు. ఆ లుక్ కి సంబంధించిన ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు అఖిల్‌. మంచు పర్వతాల్లో, పోరాడుతున్న యోధుడిలా మొహంమీద‌ గాయాలతో ఉన్న ఫొటోలను చూస్తుంటే భారీ యాక్షన్‌ సీన్లు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ఫోటోలు బాగానే ఉన్నాయికాని, వీటిని చూస్తుంటే ఎక్కువ మంది చూసిన పాపుల‌ర్ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్ సిరీస్‌లోని హీరో జాన్‌ స్నో ను లాగే ఉన్నాయి. జాన్ స్నో కేర‌క్ట‌ర్ మంచులో ఇలాంటి గెటెప్ లోనే ఉంటాడు. ‘ఏజెంట్’ మూవీలో అఖిల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఊల్ కోట్ తో, ఇద్దరి గెటప్పులో పెద్ద చేంజ్ లేదు. దాదాపు ఒక్క‌లాగే ఉన్నాయ‌ని సోషల్ మీడియాలో పెద్ద‌ చర్చ. నిజానికి ‘ఏజెంట్‌స సినిమా హాలీవుడ్ క‌ల్ట్ మూవీ సిరీస్‌ ‘బోర్న్‌’ ఆధారంగా తెరకెక్కనుంది. ఒక‌సినిమాలో మ‌రో సిరీస్ లోని గెటెప్ ను కాపీ కొట్ట‌డ‌మేంట‌ని ట్రోల్ చేస్తున్నారు. ఇది కావాల‌ని జ‌రిగిందా? అనుకోకుండా షూటింగ్ లో గెటప్ అలాగే ఉందా? తెలియ‌దు. అస‌లు అఖిల్ గెటెప్, అన్నీ జాన్ స్నో కేర‌క్ట‌ర్ కు ద‌గ్గ‌ర‌గా ఉన్నాయ‌ని ఇంత‌కుముందే సోషల్‌ మీడియాలో టాక్‌ నడిచింది. ఇద్ద‌రి హైట్ దాదాపుగా ఒక్క‌టే.

 

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom