Swetha
సెప్టెంబర్ 25 న రావాల్సిన బాలకృష్ణ అఖండ 2 పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ లేట్ అయితే అయింది కానీ రిలీజ్ తర్వాత మాత్రం కలెక్షన్స్ ఊచకోత కన్ఫర్మ్ అనే గట్టి నమ్మకంతో ఉన్నారు మూవీ టీం. అలాగే ఇటు ఆడియన్స్ కూడా సినిమా మీద భారీ అంచనాలు పెంచుకున్నారు.
సెప్టెంబర్ 25 న రావాల్సిన బాలకృష్ణ అఖండ 2 పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ లేట్ అయితే అయింది కానీ రిలీజ్ తర్వాత మాత్రం కలెక్షన్స్ ఊచకోత కన్ఫర్మ్ అనే గట్టి నమ్మకంతో ఉన్నారు మూవీ టీం. అలాగే ఇటు ఆడియన్స్ కూడా సినిమా మీద భారీ అంచనాలు పెంచుకున్నారు.
Swetha
సెప్టెంబర్ 25 న రావాల్సిన బాలకృష్ణ అఖండ 2 పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ లేట్ అయితే అయింది కానీ రిలీజ్ తర్వాత మాత్రం కలెక్షన్స్ ఊచకోత కన్ఫర్మ్ అనే గట్టి నమ్మకంతో ఉన్నారు మూవీ టీం. అలాగే ఇటు ఆడియన్స్ కూడా సినిమా మీద భారీ అంచనాలు పెంచుకున్నారు. సో ఇక కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడమే లేట్. అయితే ఈలోపు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ పోటీ పడ్డాయంట. నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ లాంటి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ ను వెనక్కు నెట్టి మరి.. జియో హాట్స్టార్ ఏకంగా రూ.85 కోట్లకు డీల్ చేసుకున్నట్లు సమాచారం. అన్ని భాషలలో కలిపి జియో హాట్ స్టార్ అఖండ 2 ఓటీటీ రైట్స్ కోసం రూ.85 కోట్లు చెల్లిస్తుందని ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఓ కండిషన్ కూడా ఉంది.
ఈ సినిమాను సెప్టెంబర్ 25 కి రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడం వలన అది కాస్త పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేసినట్లయితే.. సంక్రాంతికి ఓటిటి లో రిలీజ్ చేస్తామని జియో హాట్స్టార్ చెప్పినట్లు తెలుస్తుంది. ఎలాగూ రాజాసాబ్ డేట్ మారిపోయింది కాబట్టి.. డిసెంబర్ 5న అఖండను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. త్వరలోనే దీనికి సంబందించిన అఫీషియల్ అప్డేట్ ఇవ్వనున్నారట. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.