sai
అజయ్ దేవగణ్ నెక్ట్ మూవీ షైతాన్ ట్రైలర్ ఈరోజు విడుదలయింది. అయితే ఈ ట్రైలర్ లో ముఖ్యంగా మాధవన్ హైలెట్ గా నిలిచాడు. దీనికి సంభందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అజయ్ దేవగణ్ నెక్ట్ మూవీ షైతాన్ ట్రైలర్ ఈరోజు విడుదలయింది. అయితే ఈ ట్రైలర్ లో ముఖ్యంగా మాధవన్ హైలెట్ గా నిలిచాడు. దీనికి సంభందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
sai
అజయ్ దేవగణ్ అప్ కమింగ్ థ్రిల్లర్ చిత్రం షైతాన్ ట్రైలర్ ఈరోజు ఉదయం విడుదలయింది. అయితే ఈ ట్రైలర్ లో అజయ్ కాకుండా మాధవన్ హైలైట్ అవ్వడమే విశేషం. గుజరాతీ సినిమా ” వష్” సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన షైతాన్ కు వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ మిస్టరీ థ్రిల్లర్ టీజర్ విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. అజయ్ దేవగణ్, జ్యోతిక, నటించిన ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే విలక్షణ నటుడు ఆర్ మాధవన్ కూడా ఈ సినిమాలో ఒక ప్రథాన పాత్రలో కనిపిస్తారు. కాగా ట్రైలర్ లో మొత్తం మాధవన్ హవానే నడిచింది.
షైతాన్ ట్రైలర్ విషయానికి వస్తే.. తన కూతురి ప్రాణానికి ప్రమాదం ఉందని పోలీసులకు జ్యోతిక ఏడుస్తూ ఫోన్ చేయడంతో మొదలవుతుంది. అసలు సంగతి ఏంటంటే ఒక అర్జెంట్ ఫోన్ కాల్ చేసుకోవటానికి అజయ్, జ్యోతికల ఇంట్లోకి అడుగు పెట్టిన మాధవన్.. ఊహించని రీతిలో వారి కూతురి పై వశీకరణ ప్రయోగం చేస్తాడు. ఆ తరువాత మాధవన్ ఏం చెప్తే అది ఆ అమ్మాయి చేస్తుంది. కూతురి ప్రాణం కోసం అజయ్ దేవగణ్ ఎన్ని సార్లు పోరాడినా మాధవన్ ఆధీనంలో ఉన్న తన కూతురే అడ్డుగా ఉండటంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండటం మనం ట్రైలర్ లో చూడవచ్చు. నేనెవరో.. అసలు ఏం చేయగలనో మీకు తెలుసా అంటూ మాధవన్ వార్నింగ్ ఇవ్వటంతో ట్రైలర్ ముగుస్తుంది. తన అద్భుతమైన నటనతో ట్రైలర్లో మాధవన్ భయపెట్టేశారు.
మొత్తానికి మంచి చెడుల మధ్య జరిగే యుద్ధాన్ని సూచిస్తూ సాగిన మిస్టరీ థ్రిల్లర్ షైతాన్ ట్రైలర్ ఆకట్టుకుంది. ఖచ్చితంగా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది. 2024 మార్చి 8న “షైతాన్’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అజయ్ దేవగణ్ గత సినిమా ” భోలా ” అనుకున్న స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. అయితే షైతాన్ తో కమ్ బ్యాక్ హిట్ ఇస్తారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.