iDreamPost
android-app
ios-app

ఆటోలో చేదు అనుభవం.. వైరల్‌గా ఐశ్వర్య రాజేష్‌ ఇంటర్వ్యూ వీడియో!

  • Published Aug 29, 2023 | 3:13 PM Updated Updated Aug 29, 2023 | 3:13 PM
  • Published Aug 29, 2023 | 3:13 PMUpdated Aug 29, 2023 | 3:13 PM
ఆటోలో చేదు అనుభవం.. వైరల్‌గా ఐశ్వర్య రాజేష్‌ ఇంటర్వ్యూ వీడియో!

తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్‌.. తమిళనాట స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాల్లో, వెబ్‌ సిరీస్‌లో ఆమె ఎక్కువగా కనిపిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఆమె నటిస్తున్నారు.  ఇక, మహిళా సాధికారత, ఆడవాళ్ల సమస్యల గురించి ఐశ్వర్య రాజేష్‌ తరచుగా మాట్లాడుతూ ఉంటారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై నేరుగానో లేక.. సోషల్‌ మీడియా ద్వారానో స్పందిస్తూ ఉంటారు.

తనకు ఎదురైన అనుభవాలను కూడా ఎలాంటి జంకు లేకుండా బయటకు చెబుతూ ఉంటారు. ఓ ఇంటర్వ్యూలో గతంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఆమె చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ అవి నేను కాలేజీ చదువుతున్న రోజులు. ఓ సారి నేను నా ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాను. ఇంటికి రావటం కోసం ఆటో ఎక్కాను. అది షేర్‌ ఆటో కావటంతో నాతో పాటు ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆటో వెళుతున్న సమయంలో అతడు నాతో తప్పుగా ప్రవర్తించాడు. నాపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు.

నేను షాక్‌కు గురయ్యాను. తర్వాత ఆటో ఆపించి, అతడ్ని చెడా,మడా తిట్టాను. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయాను. ఎక్కడా ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతోంది. ప్రతినిత్యం మహిళలు ఇలాంటివి ఎన్నో  ఎదుర్కొంటున్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఐశ్వర్య రాజేష్‌ రాంబంటు అనే సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆమె తండ్రి రాజేష్‌ హీరో కాగా.. మేనత్త శ్రీలక్ష్మి ప్రముఖ సీనియర్‌ కమెడియన్‌.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet