iDreamPost
android-app
ios-app

వీడియో: ఐశ్వర్య రాయ్‌ చేతికి గాయం.. ఏమైందంటే?

  • Published May 16, 2024 | 12:58 PM Updated Updated May 16, 2024 | 12:58 PM

Aishwarya Rai Bachchan Injured: భారతీయ చలన చిత్రం రంగంలో విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ కి ప్రత్యేక స్థానం ఉంది. అభిషేక్ బచ్చన్ తో పెళ్లైన తర్వాత ఆమె ఇండస్ట్రీకి కొంతకాలం దూరమైంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.

Aishwarya Rai Bachchan Injured: భారతీయ చలన చిత్రం రంగంలో విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ కి ప్రత్యేక స్థానం ఉంది. అభిషేక్ బచ్చన్ తో పెళ్లైన తర్వాత ఆమె ఇండస్ట్రీకి కొంతకాలం దూరమైంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.

  • Published May 16, 2024 | 12:58 PMUpdated May 16, 2024 | 12:58 PM
వీడియో: ఐశ్వర్య రాయ్‌ చేతికి గాయం.. ఏమైందంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కాలేజ్ లో చదివే రోజుల్లోనే మోడలింగ్ చేస్తూ కొన్ని టీవీ యాడ్స్ లో నటించింది. ఆ సమయంలో మిస్ ఇండియా పోటీలో రెండో స్థానంలో నిలిచింది. 1994 వ సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికయ్యింది. ప్రపంచంలో అత్యంత అందమైన మహిళ్లో ఐశ్వర్య ఒకరు అంటారు. 1997 లో మణిరత్నం దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఇరువర్ (తెలుగులో ఇద్దరు) మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఐశ్యర్యా రాయ్.. బిగ్ బీ అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకుంది.  ఐశ్వర్య రాయ్ కు గాయమైంది.. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగిందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ అందాల తార, విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ చేతికి గాయం అయ్యింది. తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఫ్యాషన్ డ్రెస్ ధరించి అలరిస్తుంది ఐశ్వర్య రాయ్. ఫ్రాన్స్ లో 77వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివంల్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 25 వరకు కొనసాగుతున్న వేడుకలలో భారత్ తరుపున పాల్గొనేందుకు ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి కేన్స్ కి ప్రయాణమైంది. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ లో ఆమె కనిపించారు. ఆమె కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి ఉండటంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆమె చేతికి తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తుంది. బహుషా వ్యాయామం చేస్తున్న సమయంలో ఏమైనా గాయం జరిగి ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ 2002 లో తొలిసారిగా కనిపించారు. ఆ సమయంలో భారీ బంగారు ఆభరణాలతో నీతా లుల్లా డిజైన్ చేసిన శారీలో రెడ్ కార్పేట్ పై కనువిందు చేసింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భారత్ తరుపు నుంచి కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కి వెళ్తూ రెడ్ కార్పేట్ పై అందమైన డ్రెస్ ధరించి తన అందాలతో అందరిని కట్టిపడేస్తుంది. ఈసారి ఐశ్వర్యతో పాటు అదితి రావు హైదర్, శోబితా ధూలిపాళ, కియారా అద్వాని కూడా కేన్స్ లో కనువిందు చేయబోతున్నారు.ఇప్పటికే ఊర్వశి రౌతేలా కేన్స్ లో పింక్ లుక్ లో కనువిందు చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ ఈ వీడియో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.. ఈసారి రెడ్ కార్పేట్ పై తమ అభిమాన హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ఎలా కనిపించనున్నారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom