iDreamPost
android-app
ios-app

ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాద్య స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

  • Published Sep 29, 2023 | 2:46 PM Updated Updated Sep 29, 2023 | 3:32 PM
ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాద్య స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

సినీ ఇండస్ట్రీలో విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ అంటే తెలియనివారు ఉండరు. 1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఆమె తర్వాత మోడల్ గా పలు టీవీ యాడ్స్ లో కనిపించారు. 1997 లో మణిరత్నం దర్శకత్వంలో ఇరువర్ (ఇద్దరు) మూవీతో తెరంగెట్రం చేశారు. ఈ చిత్రం తర్వాత వచ్చి జీన్స్ ఐశ్వర్య రాయ్ కి మంచి పేరు తీసుకు వచ్చింది. వరుసగా పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తూ నెంబర్ వన్ హీరోయిన్ స్థాయికి వెళ్లింది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే 2007 లో బిగ్ బీ అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతుల ముద్దుల కూతురు పేరు ఆరాద్య. తాజాగా ఐశ్వర్య రాయ్ దంపతులకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో అందమైన కపుల్స్ గా  పేరు తెచ్చుకున్నారు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్. ఈ జంటకు ఆరాద్య అనే పాప ఉంది. వివాహం జరిగిన తర్వాత కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఐశ్వర్య రాయ్ ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా సినీ సెలబ్రెటీల లైఫ్ స్టైల్ చాలా లగ్జరీ ఉంటుందని అంటుంటారు. వారు ధరించే కాస్ట్యూమ్స్, బంగార ఆభరణాలు,వాచ్, కార్లు, బైకులు ప్రతి ఒక్కటీ లక్షలు, కోట్లలో ఉంటాయి. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాయ్ ముద్దుల కూతురు ఆరాద్య స్కూల్ ఫీజు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ప్రస్తుతం అభిషేక్, ఐశ్వర్య రాయ్ దంపతుల గారాల పట్టి ఆరాద్య ప్రస్తుతం ముంబాయిలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతుంది. ఆరాద్య స్కూల్ ఫీజు రూ. 10 లక్షల వరకు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు ఉన్న ఈ స్కూల్ లో ఎల్ కేజీ నుంచి రూ.5 లక్షలకు పైగా ఫీజు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇక 8 వ తరగతి నుంచి 12 ఇంటర్మీడియట్ క్లాసులకు రూ. 15 నుంచి రూ.20 లక్షలకు పైనే ఫీజులు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఏంతైనా కోట్లు సంపాదించే ఐషూ దంపతులు లక్షల్లో ఫీజు చెల్లించడం పెద్ద విషయం ఏమీ కాదని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్కూల్ ఫీజే లక్షల్లో చెల్లిస్తున్నారా? అంటూ మరికొంతమంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.