iDreamPost
android-app
ios-app

అభిమానులకు షాక్‌.. త్వరలో అదితి శంకర్‌ పెళ్లి!

  • Published Aug 09, 2023 | 12:55 PM Updated Updated Aug 09, 2023 | 1:11 PM
  • Published Aug 09, 2023 | 12:55 PMUpdated Aug 09, 2023 | 1:11 PM
అభిమానులకు షాక్‌.. త్వరలో అదితి శంకర్‌ పెళ్లి!

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ వారసురాలిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు ఆయన కూతురు అదితి శంకర్‌. కార్తీ హీరోగా వచ్చిన ‘విరుమన్‌’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా, శివకార్తికేయన్‌ హీరోగా వచ్చిన ‘మావీరన్‌’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. తీసింది రెండు సినిమాలే అయినా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రెండు సినిమాలు తెలుగులోనూ డబ్‌ అయి రిలీజ్‌ అవ్వటంతో ఆమెకు తెలుగు నాట కూడా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది.

ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విష్ణువర్థన్‌ దర్శకత్వంలో ఓ సినిమా.. రామ్‌ కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో 2004లో వచ్చిన ‘7జీ రేయిన్‌బో కాలనీ’ సీక్వెల్‌లోనూ నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. అదితి సినిమాల్లో బిజీగా ఉన్న ఇలాంటి సమయంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో, మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Shanker daughter marriage soon

అదితి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం. ఈ వార్తలు అదితికి కూడా చేరాయి. దీంతో ఆ పెళ్లి వార్తలపై ఆమే స్వయంగా స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ స్టోరీ పెట్టారు. ఆ స్టోరీ ఈ విధంగా ఉంది.. ‘‘ నటి అదితి శంకర్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు?? ఆ వివరాలు’’ అని ఉంది. దానిపై ఆమె వ్యంగంగా స్పందించారు. ‘‘ నాకు ఎంతో ఆత్రుతగా ఉంది. పెళ్లి కుమారుడు ఎవరో తెలుసుకోవాలని ఉంది’’ అని రాసుకొచ్చారు. అదితి క్లారిటీ ఇ‍వ్వటంతో మీడియాలో, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పెళ్లి పుకార్లకు బ్రేక్‌ పడినట్లు అయింది.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş