iDreamPost
android-app
ios-app

సిద్ధార్థ్‌తో ఎఫైర్‌.. అలాంటి విషయాలు బయటకి చెప్పలేనన్న అదితీ!

  • Published Jul 04, 2023 | 7:29 PM Updated Updated Jul 04, 2023 | 7:29 PM
  • Published Jul 04, 2023 | 7:29 PMUpdated Jul 04, 2023 | 7:29 PM
సిద్ధార్థ్‌తో ఎఫైర్‌.. అలాంటి విషయాలు బయటకి చెప్పలేనన్న అదితీ!

ప్రముఖ హీరో సిద్ధార్థ్‌- హీరోయిన్‌ అదితీ రావు హైదరీల మధ్య గత కొన్నేళ్లుగా లవ్‌ ఎఫైర్‌ నడుస్తోందంటూ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారం నిజమే అని నమ్మేంతలా ఈ ఇద్దరూ కలిసి టూర్లకు, షికార్లకు వెళుతూ ఉన్నారు. వీరిద్దరూ బయట కలిసి తిరుగుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉన్నాయి. ఇక, వీరి లవ్‌ ఎఫైర్‌ గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఇప్పటి వరకు ఈ ఇద్దరిలో ఎవ్వరూ సరైన క్లారిటీ ఇవ్వలేదు.

మీడియా ప్రతినిధులు వీరి లవ్‌ ఎఫైర్‌ గురించి ఎన్ని ప్రశ్నలు సంధించినా.. ఇద్దరూ దాట వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాజాగా, అదితీ రావు హైదరీ ఓ నేషనల్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ కూడా వీరి లవ్‌ ఎఫైర్‌ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు అదితీ సమాధానం ఇస్తూ.. ‘‘ నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా.. అది కుటుంబానికి సంబంధించి కావచ్చు.. ఫ్రెండ్స్‌, ఇతర వ్యక్తుల గురించిన విషయాలు కావచ్చు.. అవి నాకు చాలా పవిత్రమైనవి. నేను వాటిని అందరి ముందు చెప్పలేను.

కొన్ని విషయాల గురించి సమయం, సందర్భం వచ్చినపుడు మాత్రమే మాట్లాడతాడు. అది కూడా ఎక్కుడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతాను. నేను దీన్ని కచ్చితంగా నమ్ముతాను. మనుషులు తమకు నచ్చినదే చేస్తారు. తమకు ఏది అవసరం అనిపిస్తే అదే చేస్తారు. నేను కూడా నాకు ఏది అవసరం అయితే అదే చేస్తాను. నా పని చేసుకుంటూ.. నా వాళ్లను సురక్షితంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తా.. నన్ను ఇబ్బంది పెట్టే కుతూహలాలకు దూరంగా ఉంటా’’ అని అన్నారు. మరి, సిద్ధార్థ్‌-అదితీలు తమ ప్రేమ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibombetcio giriş