iDreamPost
android-app
ios-app

ఆదిపురుష్‌ సినిమా.. హనుమంతుడికి కేటాయించే సీటు ఎలా ఉండనుంది అంటే!

  • Published Jun 15, 2023 | 4:08 PM Updated Updated Jun 15, 2023 | 4:08 PM
  • Published Jun 15, 2023 | 4:08 PMUpdated Jun 15, 2023 | 4:08 PM
ఆదిపురుష్‌ సినిమా.. హనుమంతుడికి కేటాయించే సీటు ఎలా ఉండనుంది అంటే!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా.. భాషతో సంబంధం లేకుండా.. అన్ని ప్రాంతాల వారు.. ఆది పురుషుడి రాకకై ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. డార్లింగ్‌ ప్రభాస్‌.. రాముడి పాత్రలో నటిస్తుండగా.. కృతి సనన్‌.. సీతమ్మగా, సైఫ్‌ అలీఖాన్‌.. రావణుడిగా నటించారు. ప్రభాస్‌ను రాముడి పాత్రలో చూడటం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి.

ఇక సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రోజునే.. ఆదిపురుష్‌ సినిమాకు సంబంధించి చిత్ర బృందం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రతి థియేటర్‌లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు కేటాయిస్తామని ప్రకటించారు. మరి కొన్ని గంటల్లో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో.. మరి హనుమంతుడికి కేటాయించే సీటు ఎలా ఉండనుంది అనే దాని గురించి ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. ఆదిపురుష్‌ సినిమా విడుదలైన థియేటర్‌లో హనుమంతుడికి కేటాయించే సీటు ఎలా ఉండనుందో ఈ ఫోటో చూస్తే అర్థం అవుతోంది.

ఆదిపురుష్‌ ప్రదర్శితం అయ్యే థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా సీటును కేటాయిస్తున్నారు. ఈ సీటుకి హనుమంతుడి ఫొటో ఉన్న క్లాత్‌ కప్పి ఉంచనున్నారు. ఈ వస్త్రం మీద జై శ్రీరామ్‌ అని రాసి ఉంటుంది అంటున్నారు. ఇక ఇప్పటికే ఆదిపురుష్‌ క్రేజ్‌కి బుక్‌ మై షో సర్వర్లు క్రాష్‌ అయ్యాయి. ఈ జోరు చూస్తుంటే.. మరో పది రోజుల వరకు కూడా టికెట్‌లు లభించడం కష్టమే అంటున్నారు. ఇక ఆదిపురుష్‌ విడుదల నేపథ్యంలో.. ప్రభాస్‌ భద్రాద్రి ఆలయానికి 10 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్‌ సినిమాకు ప్రత్యేక రాయితీలు ప్రకటించారు. టికెట్‌ ధర పెంపు, బెనిఫిట్‌ షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap