Dharani
Dharani
ఔంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రారంభం నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ట్రైలర్, టీజర్ చూసిన ప్రేక్షకులు.. దర్శకుడు ఔం రౌత్ మీద భారీ ఎత్తున విమర్శలు చేశారు. ప్రభాస్ లాంటి హీరోతో ఎలాంటి సినిమా తీస్తున్నావ్ అంటూ మండిపడ్డారు. ఇక సినిమా విడుదలైన తర్వాత విమర్శలు మరింత పెరిగాయి. దర్శకుడు ఔం రౌత్ ఆదిపురుష్ చిత్రంలో రామాయణాన్ని పూర్తిగా వక్రీకకరించాడని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆదిపురుష్ సినిమా మీద నేపాల్ ప్రభుత్వం కూడా మండిపడింది. సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. సినిమా మీద విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ ప్రభంజనం కూడా ఆలానే ఉంది.
ఇక ఈ సినిమా ఇప్పటికే భారీగా వసూళ్లతో దూసుకుపోతుంది. వారం రోజుల్లోనే సుమారు ఐదు వందల కోట్ల వరకు వసూల్ చేసిందని టాక్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ సినిమా టికెట్స్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఈ మూవీ టికెట్స్ ధరలు తగ్గించారని తెలుస్తోంది. అది కూడా మల్టీప్లెక్స్‌లలో టికెట్ల ధరను భారీగా తగ్గించారు చిత్రనిర్మాతలు. త్రీడీలో సినిమా చూసేందుకు రూ.150 లకే టికెట్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ..కేరళ, తమిళనాడులో టికెట్ రేట్లు తగ్గించలేదు.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీత పాత్రలో కనిపించింది. అలాగే సన్నీ సింగ్ లక్ష్మణుడిగా.. దేవ్ దత్ హనుమంతుడిగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి రకరకాల వివాదాలు ఈ మూవీని చుట్టుముడుతున్నాయి.