iDreamPost
android-app
ios-app

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కి BMW కారు.. ఇంతకీ ఏ సినిమా తీశాడో తెలుసా?

  • Author ajaykrishna Updated - 04:29 PM, Tue - 31 October 23

సినిమా సక్సెస్ అయితే.. ఈ మధ్య దర్శకులకు ప్రొడ్యూసర్స్ భారీ భారీ బహుమతులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిదే లిస్ట్ లో చేరాడు ఓ క్రేజీ డైరెక్టర్.. అతను ఎవరో కాదు..

సినిమా సక్సెస్ అయితే.. ఈ మధ్య దర్శకులకు ప్రొడ్యూసర్స్ భారీ భారీ బహుమతులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిదే లిస్ట్ లో చేరాడు ఓ క్రేజీ డైరెక్టర్.. అతను ఎవరో కాదు..

  • Author ajaykrishna Updated - 04:29 PM, Tue - 31 October 23
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కి BMW కారు.. ఇంతకీ ఏ సినిమా తీశాడో తెలుసా?

ఈ మధ్యకాలంలో సినిమాలు సక్సెస్ అయితే.. ఆ సినిమాలను తెరకెక్కించిన దర్శకులకు నిర్మాతలు ఖరీదైన బహుమానాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అంటే.. సినిమా సక్సెస్ అయితే ఆ దర్శకులకు, హీరోలకు, ఇంకా సక్సెస్ లో మెయిన్ భాగమైన వారికి నిర్మాతలు గిఫ్ట్స్ ఇవ్వడం కొత్త కాదు. కొన్నాళ్ళుగా ఈ తంతు రిపీట్ కొనసాగుతుంది. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో ఈ కల్చర్ ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే.. ఈ ఏడాది జైలర్ సినిమా సక్సెస్ అయినందుకు నిర్మాత కళానిధి మారన్.. ఆ సినిమా హీరో సూపర్ స్టార్ రజినీకి, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లకు ఖరీదైన బిఎండబ్ల్యూ కార్లతో పాటు చెక్కులు కూడా అందించారు.

ఆ సినిమా ఊహించని రేంజ్ లో సక్సెస్ అవ్వడమే కాకుండా.. అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొట్టి రికార్డులు తిరగరాసింది. దీంతో ప్రొడ్యూసర్ హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ లకు లాభాలలో వాటా అందించారు. మరి ఇప్పుడు ఇదే బాటలో రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మార్క్ ఆంటోనీ’ ప్రొడ్యూసర్ కూడా చేరడం విశేషం. అవును.. విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ మూవీ.. థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విశాల్ కి.. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కి.. ప్రొడ్యూసర్ వినోద్ లకు మార్క్ ఆంటోనీ బ్లాక్ బస్టర్ అందించింది.

కట్ చేస్తే.. మార్క్ ఆంటోనీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తుంది. విశాల్, SJ సూర్య ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు నిర్మాతకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఇప్పుడు నిర్మాత వినోద్.. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కి ఖరీదైన బిఎండబ్ల్యూ కారును(రూ. 90 లక్షలు)గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముందునుండి పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన మార్క్ ఆంటోనీ మూవీ.. సెన్సేషన్ క్రియేట్ చేసి.. విశాల్ కెరీర్ లో రూ. 100 కోట్ల మూవీగా నిలిచింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి మార్క్ ఆంటోనీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss