iDreamPost
android-app
ios-app

కల్కి నటికి తీవ్ర గాయాలు.. ఫోటోలు పోస్ట్ చేస్తూ ఎమోషన్!

  • Published Jul 08, 2024 | 1:23 PM Updated Updated Jul 08, 2024 | 1:23 PM

Actress Injured: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కల్కి 2898 ఏడీ గురించి టాక్ వినిపిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ మూవీలో నటించిన నటికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది.

Actress Injured: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కల్కి 2898 ఏడీ గురించి టాక్ వినిపిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ మూవీలో నటించిన నటికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది.

  • Published Jul 08, 2024 | 1:23 PMUpdated Jul 08, 2024 | 1:23 PM
కల్కి నటికి తీవ్ర గాయాలు.. ఫోటోలు పోస్ట్ చేస్తూ ఎమోషన్!

ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్ బీ అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్యతారాగణం నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో యాక్షన్ సీన్లు, విజువల్స్, మహాభారతం సీన్లు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి. ఈ చిత్రంలో దాదాపు అన్ని భాషల నటీనటులు నటించారు. తాజాగా ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన ఓ నటికి ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. వాటికి సంబంధించిన పోటోలు పోస్ట్ చేసి ఎమోషన్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియా విజువల్ వండర్ గా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ భారీ విజయం సొంతం చేసుకొని రికార్డుల మోత మోగిస్తుంది. ఈ మూవీలో దర్శకుడు నాగ్ అశ్విని చూపించిన భూత, భవిష్యత్ కాలాలు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రతి ఒక్క సన్నివేశంలో థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఈ మూవీలో చాలా మంది స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే. మాలీవుడ్ హీరోయిన్ అన్నా బెన్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో కీలక పాత్ర పోషించింది. అరగంట సేపు కనిపించినా కైరా పాత్రతో యాక్షన్, సెంటిమెంట్ సీన్లతో ఆకట్టుకుంది. తాజాగా ఈ అమ్మడు తనకు షూటింగ్ లో గాయం అయినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషన్ అయ్యింది.

నటి అన్నామేన్ ఇన్ స్ట్రాగ్రామ్ లో కొన్ని ఫోటో షేర్ చేసింది. వాటిలో వర్కింగ్ స్టిల్స్, తన గెటప్ కి సంబంధించిన ఫోటోలతో పాటు తన ఒంటికి మీద పలు తగిలిన గాయాలకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసింది. కైరా పాత్ర రెండేళ్ల క్రితం నా దగ్గర వచ్చినపుపుడు చాలా సంతోషించాను. ఈ పాత్ర నా కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీలో నాకు మంచి పాత్ర ఇచ్చిన నాగ్ అశ్విన్ కి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన షూటింగ్ లో ఎంత పనిఒత్తిడితో ఉన్నా.. చాలా రిలాక్స్ గా కనిపిస్తుంటారు. ఈ సినిమా ద్వారా నేను చాలా గొప్ప గొప్ప నటీనటులను కలుసుకున్నాను. నాగ్ అశ్విన్ తో పనిచేయడం నాకు గర్వంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Anna Ben 🌸 (@benanna_love)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet