iDreamPost
android-app
ios-app

నేను కామంతోనే అతనికి దగ్గరయ్యాను: విద్యాబాలన్ షాకింగ్ స్టేట్మెంట్!

  • Author ajaykrishna Published - 01:01 PM, Thu - 6 July 23
  • Author ajaykrishna Published - 01:01 PM, Thu - 6 July 23
నేను కామంతోనే అతనికి దగ్గరయ్యాను: విద్యాబాలన్ షాకింగ్ స్టేట్మెంట్!

జనరల్ గా ఎవరైనా తొలిచూపులోనే ప్రేమలో పడితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పుకుంటారు. కానీ.. స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ రూటే వేరు. తొలిసారి తన భర్తతో పరిచయం అయినప్పుడు తనకు ‘లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్’ కలిగిందని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో విద్యా బాలన్ మాటలకు అందరూ షాక్ అవుతున్నారు. బాలీవుడ్ స్టార్స్ లో ఒకరైన విద్యా.. పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్, బయోపిక్స్ చేస్తూ కెరీర్ ని సాగిస్తోంది. అయితే.. కెరీర్ లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించినా రాని నేమ్, ఫేమ్ ఒక్కసారిగా ‘డర్టీ పిక్చర్’ మూవీతో సొంతం చేసుకుంది. అప్పటినుండి స్టార్ గా వెనుదిరిగి చూసుకోలేదు.

ఇక 2012లో సిద్ధార్థ్ రాయ్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎప్పుడూ ఏదొక వివాదంతో వార్తల్లో ట్రెండ్ అయ్యే విద్యా.. రీసెంట్ గా మీడియా ముఖంగా తన భర్త గురించి, పర్సనల్ లైఫ్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసి షాకిచ్చింది. ఈ సందర్బంగా విద్యా మాట్లాడుతూ.. ‘అందరిదీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే.. మా ఆయనతో నాది లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. మేం తొలిచూపులో కామంతో కనెక్ట్ అయ్యామని అనుకుంటాను. మా మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పటికీ.. మేం ఫిజికల్ గానే అట్రాక్ట్ అయ్యాం. ఎందుకంటే నా భర్త అందగాడు. హ్యాండ్సమ్ నెస్ తో పాటు బాగా కేరింగ్ గా ఉంటాడు. ఆ విధంగా నేను సిద్దార్థ్ కి కనెక్ట్ అయ్యాను.” అని చెప్పుకొచ్చింది.

ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘నేను మా నాన్న వద్ద చాలా సెక్యూర్డ్ గా భావిస్తాను. ఆ క్వాలిటీ సిద్ధార్థ్‌ లో చూసుకున్నాను. ఆ విషయమే నన్ను అతని వైపు నడిపించింది. తను చాలా ప్రైవేట్‌ గా ఉంటాడు. ఇక మా ప్రేమలో ముందుగా తానే ప్రపోజ్ చేశాడు. మొదట్లో ప్రతి చిన్నదానికి ఓవర్‌ గా రియాక్ట్ అయ్యేదాన్ని. ఇప్పుడు కామ్ అయిపోయాను.’ అని చెప్పింది. ప్రస్తుతం విద్యా మాటలు సినీ వర్గాలలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రెజెంట్ విద్యా కెరీర్ విషయానికి వస్తే.. అను మీనన్ దర్శకత్వంలో ‘నియత్‌’ అనే మూవీ చేసింది. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ అని విద్యా బాలన్ బోల్డ్ స్టేట్మెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş