iDreamPost
android-app
ios-app

నాలుగో పెళ్లికి రెడీ.. డేట్ చెప్పేసిన నటి వనితా విజయ్ కుమార్..

  • Published Oct 01, 2024 | 5:50 PM Updated Updated Oct 01, 2024 | 5:52 PM

Actress Vanitha Vijaykumar: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల వారసులు హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో ఒకప్పటి అందాలతార మంజుల కూతురు వనితా విజయ్ కుమార్ ఒకరు.

Actress Vanitha Vijaykumar: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల వారసులు హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో ఒకప్పటి అందాలతార మంజుల కూతురు వనితా విజయ్ కుమార్ ఒకరు.

  • Published Oct 01, 2024 | 5:50 PMUpdated Oct 01, 2024 | 5:52 PM
నాలుగో పెళ్లికి రెడీ.. డేట్ చెప్పేసిన నటి వనితా విజయ్ కుమార్..

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి అందాల తార మంజుల గురించి ప్రత్యేక పరిచయం అక్కరేలేదు. స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించింది. తన సహనటుడు విజయ్ కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. విజయ్ కుమార్ కి మొత్తం ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. వారిలో వనితా విజయ్ కుమార్  ఒకరు. తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ..  తెలుగులో ‘దేవీ’ మూవీతో మంచి పేరు సంపాదించింది. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదాలతో ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంటుంది.  తాజాగా మరోసారి వనితా విజయ్ కుమార్ పేరు ఇంటర్నెట్ లో మారుమోగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ నటి వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరేలేదు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలతో ఆమె పేరు నెట్టింట వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లికి సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ విషయంపై రూమర్స్ వచ్చాయి.. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఆమె అఫిషియల్ గా తెలిపింది. చాలా కాలంగా తనకు పరిచయం ఉన్న రాబర్ట్ అనే కొరియోగ్రాఫర్ తో ఏడడుగులు వేయబోతున్నట్లు ప్రకటించింది.  1995 లో ‘చంద్రలేఖ’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వనిత సినిమాల్లో కన్నా వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. 2000లో నటుడు ఆకాశ్ ని పెళ్లి చేసుకుంది.. వీరికి కొడుకు, కూతురు పుట్టిన తర్వాత మనస్పర్ధలతో 2005లో విడాకులు తీసుకుంది.  కొంత కాలం తర్వాత 2007 లో ఆనంద్ జయదర్శన్ అనే బిజినెస్ మెన్ ని రెండో వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ కొడుకు జన్మించాడు.. పేరు జయనీత్. కొంత కాలం తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. 2020లో వనితా.. ప్రముఖ ఫోటో గ్రాఫర్ పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది.కేవలం నాలుగు నెలల్లోనే వీరి పెళ్లి పెటాకులైంది. కాకపోతే తమకు పెళ్లి కాలేదని.. కేవలం ఎంగేజ్ మెంట్ మాత్రమే అయిందని వనితా వివరణ ఇచ్చింది.

ఇదంతా పక్కన బెడితే కొంత కాలంగా రాబర్డ్ అనే కొరియోగ్రాఫర్ తో ఈ 43 ఏళ్ల భామ రిలేషన్ షిప్ కొనసాగిస్తూ వచ్చింది.  ఇటీవల వీరి మధ్య ఎఫైర్ నడుస్తుందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ వనితా త్వరలో అతనితో ఏడడుగులు వేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. రాబర్ట్ మాస్టర్ కి ఆమె బీచ్ లో బికినీలో మోకరిల్లి ప్రపోజ్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్టోబర్ 5న పెళ్లి జరగనుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇటీవల ప్రశంత్ నటించిన ‘అంధగన్’ మూవీలో వనితా విజయ్ కుమార్ నటనకు ప్రశంసలు అందాయి. ప్రస్తుతం ‘ఎంజీఆర్ శివాజీ రజినీ కమల్’ అనే మూవీలో నటిస్తుంది. మరి ఇది కేవలం సినిమా అప్డేట్ మాత్రమేనా? లేక నిజంగా నాలుగో పెళ్లా? అనేది ఆ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Vanitha (@vanithavijaykumar)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio