iDreamPost
android-app
ios-app

సమంతలానే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మరో నటి..

  • Published Sep 24, 2023 | 3:44 PM Updated Updated Sep 24, 2023 | 3:44 PM
  • Published Sep 24, 2023 | 3:44 PMUpdated Sep 24, 2023 | 3:44 PM
సమంతలానే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మరో నటి..

స్టార్‌ హీరోయిన్‌ సమంత మయోసైటిస్‌ వంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈ వ్యాధితో బాధపడుతున్న సమంత.. ప్రస్తుతం చికిత్స కోసం అమెరికా వెళ్లింది. ఇక ట్రీట్‌మెంట్‌లో భాగంగా వాడిన స్టెరాయిడ్స్‌ వల్ల తన ముఖంలో చాలా మార్పులు వచ్చాయని.. మునపటి కళ పోయిందని చెప్పుకొచ్చింది సమంత. ఏది ఏమైనా వ్యాధి నుంచి కోలుకోవడం ముఖ్యం కనుక.. అన్నింటిని భరిస్తోంది. అందుకే సినిమాలకు సైతం బ్రేక్‌ ఇచ్చింది. ఇక హీరోయిన్‌ ప్రియా బాజ్‌పేయ్‌, కల్పికా గణేశ్‌ సైతం మయోసైటిస్‌తో పోరాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. వారిలానే.. తాను కూడా ఓ అరుదైన వ్యాధితో బాధడపుతున్నట్లు ప్రకటించారు నటి వనితా విజయ్‌ కుమార్‌. ఆ వివరాలు..

నటి వనితా విజయ్‌ కుమార్‌ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. సమంతలానే తాను కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వూలో వనితా విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘నేను చాలా ఏళ్ల నుంచి క్లాస్ట్రోఫోబియాతో బాధపడుతున్నాను. దీని వల్ల చిన్న చిన్న ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉండలంటే భయమేస్తుంది. లిఫ్ట్‌, వాష్‌రూమ్‌ వంటి చిన్న ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉండలేను. కిటికీలు లేని గదుల్లో, జనసమూహాల్లో నాకు ఊపిరాడనట్లు అనిపిస్తుంది. దీన్నుంచి బయటపడటానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

గతంలో సంపూర్ణేశ్‌ బాబు సైతం.. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఇలాంటి లక్షణాలతోనే బాధపడ్డాడు. ఇక వనితా విజయ్‌కుమార్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. తమిళ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొని కెరీర్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై నటిగా సత్తా చాటుతోంది. ఇక ఆమె కుమార్తె జోవిక సైతం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే జోవిక ముంబైలోని అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఏడాదిపాటు శిక్షణ కూడా తీసుకుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom