iDreamPost
android-app
ios-app

డబ్బు, స్టేటస్ వస్తాయ్ పోతాయ్! నీతులు చెప్పట్లేదన్న తేజస్వి!

  • Author ajaykrishna Updated - 11:08 AM, Sat - 15 July 23
  • Author ajaykrishna Updated - 11:08 AM, Sat - 15 July 23
డబ్బు, స్టేటస్ వస్తాయ్ పోతాయ్! నీతులు చెప్పట్లేదన్న తేజస్వి!

సెలబ్రిటీ హోదా వచ్చాక ఎవరైనా వేదాంతాలు మాట్లాడితే సోషల్ మీడియాలో ఖచ్చితంగా ట్రోల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే.. కామన్ పీపుల్ సినిమాలలో చెప్పే సందేశాలే పెద్దగా పట్టించుకోరు. అలాంటిది రియల్ లైఫ్ గురించి సినీ సెలబ్రిటీలు ఓ తెగ మెసేజులు ఇచ్చేస్తే.. నూటికి తొంభైశాతం జనాలు యాక్సెప్ట్ చేయలేరు. పైగా ఆ హోదాలో ఉన్నవారు ఎన్నైనా చెబుతారులే.. అంటూ లైట్ తీసుకుంటారు. అయితే.. జీవితం గురించి పాఠాలు.. వేదాంతాలు చెప్పాలన్నా కూడా వయసు, అనుభవాలు కన్సిడర్ చేస్తుంటారు. కానీ.. ఓ స్టార్డమ్ లేని.. సరైన కెరీర్ లేని యంగ్ బ్యూటీలు సైతం జీవితం గురించి సందేశాలు ఇచ్చేస్తుంటే.. ఎలా ఉంటుందో మీకు తెలుసు.

తాజాగా తెలుగు బ్యూటీ తేజస్వి మడివాడ.. అంతటి ధైర్యమే చేసింది. బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ.. బయటికి వచ్చాక పాజిటివ్ కాకుండా నెగటివ్ వేలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఆమె మైండ్ సెట్, అందరి మీద నోరు పారేసుకోవడం లాంటివి చేసి ఆ ఇమేజ్ మూటగట్టుకుంది. అయితే.. కెరీర్ విషయానికి వస్తే.. చిన్నచిన్న పాత్రలతో స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. కానీ.. సక్సెస్ లు లేక అవకాశాలు రాక.. ఒకానొక దశలో స్కిన్ షోకి తెరలేపింది. అక్కడినుండి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. కేవలం గ్లామర్ ఫోటోలు పెడుతూ.. యూత్ ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటో షేర్ చేసి.. వేదాంతాలు వల్లించే ప్రయత్నం చేసింది. దీంతో అందరి చూపు.. ఆమె చెప్పిన మెసేజ్ పై కాకుండా బోల్డ్ అందాలపై పడింది. ‘డబ్బు, స్టేటస్, క్లాస్, పెద్ద పెద్ద జీవిత లక్ష్యాలు, ఫ్యూచర్ గురించి ప్లాన్స్ లేకుండా హ్యాపీగా ఉన్నవాళ్లను చాలామందిని చూసాను. అదే పనిగా జీవిత లక్ష్యం కోసం పరిగెత్తే వాళ్లను కూడా చూశా. అలాంటి వారు లక్ష్యాలకు చేరువైనా ఏదొక వెలతిని చూస్తుంటారు. అందుకే.. డబ్బు, స్టేటస్, మనుషులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ.. మన ఎదుటి వాళ్లకి ఏం చేశాం.. ఎదుటి వాళ్లు మనకు ఏం చేశారన్నది మిగిలిపోతుంది. ఆఖరికి మనల్ని ప్రేమించే వాళ్ళ మధ్యలో ఉంటే.. అంతకుమించిన ఆనందం ఉండదు.’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తేజస్వి పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఆమె మెసేజ్ కంటే బోల్డ్ ఫోటో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. మరి తేజస్వి గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss