iDreamPost
android-app
ios-app

గంగానదిలో పవిత్రస్నానం ఆచరించిన బాలకృష్ణ హీరోయిన్ పై ట్రోల్స్! పోస్ట్ వైరల్!

  • Author ajaykrishna Published - 08:36 AM, Tue - 8 August 23
  • Author ajaykrishna Published - 08:36 AM, Tue - 8 August 23
గంగానదిలో పవిత్రస్నానం ఆచరించిన బాలకృష్ణ హీరోయిన్ పై ట్రోల్స్! పోస్ట్ వైరల్!

సినిమాలకు దూరమైనా సినీతారలు సోషల్ మీడియాకు చాలా దగ్గరగా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలతో సంబంధం లేకపోయినా.. తమ రెగ్యులర్ లైఫ్ కి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదొక అప్డేట్ ఫ్యాన్స్ కి అందిస్తున్నారు. ఎల్లప్పుడూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు. హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ సంపాదించుకున్నా.. ఫ్యాన్స్ తో టచ్ లో ఉండాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియా అకౌంట్ తెరవాల్సిందే. అయితే.. సోషల్ మీడియా అన్నాక అందరూ అభిమానులే ఉండరు కదా! పాజిటివ్, నెగిటివ్ రెండు రకాల వాళ్లు ఎదురవుతుంటారు. తాజాగా బాలకృష్ణ హీరోయిన్ పెట్టిన ఓ పోస్ట్ కి.. రెండు రకాలుగా కామెంట్స్ చేశారు నెటిజన్స్.

ప్రస్తుతం ఆ హీరోయిన్ కి సంబంధించి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. తనుశ్రీ దత్తా. బాలకృష్ణతో కలిసి 2005లో ‘వీరభద్ర’ అనే మూవీ చేసింది. తెలుగులో ఆమె చేసిన ఒకే ఒక్క సినిమా ఇదే. ఆ తర్వాత మళ్లీ తెలుగువైపు రాలేదు. ఎందుకంటే అమ్మడు బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసింది. హిందీలో ‘ఆషిక్ బనాయా ఆప్‌ నే’ సినిమా దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సినిమా గుర్తు లేకపోయినా.. అందులో ఇమ్రాన్ హష్మీ తో తనుశ్రీ చేసిన రొమాంటిక్ సాంగ్ ని ఎవరు మర్చిపోలేరు. డెబ్యూ మూవీతోనే బాలీవుడ్ ని షేక్ చేసేసింది ఈ భామ. ఫస్ట్ సినిమాతో క్రేజ్, ఆఫర్స్ వచ్చినప్పటికి ఫామ్ లోకి రాలేకపోయింది. చివరికి సినిమాలకు దూరమైంది.

ఇక తనుశ్రీ సినిమాలు చేయడం ఆపేసి చాలా ఏళ్లు అవుతోంది. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉంటోంది. ఇకపోతే ఆ మధ్య బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్ పై లైంగిక ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన విషయం విదితమే. మీటూ ఉద్యమంలో భాగంగా తనుశ్రీ అతని గురించి ఆరోపించింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తనుశ్రీ ఆధ్యాత్మిక టూర్ లో భాగంగా కాశీ వారణాసిలో ఉంది. అక్కడ గంగానదిలో పవిత్రస్నానం ఆచరించిన తనుశ్రీ.. ఆ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘కాశీ విశ్వనాథుడి సన్నిధిలో మణికర్ణిక ఘాట్ వద్ద గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించడం గొప్ప అనుభూతి కలిగించింది’ అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటే.. కొందరు నెటిజన్స్.. ‘ఆ నీరు కలుషితం అయ్యాయి.. స్కిన్ ప్రాబ్లెమ్స్ వస్తాయని ఆ మాత్రం తెలియదా?’ అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకొందరు పాపులారిటీ కోసమని.. ఇలా హెల్త్ ని లెక్క చేయట్లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి తనుశ్రీ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet