iDreamPost
android-app
ios-app

దుబాయ్ య్యూటుబర్‌తో ప్రముఖ నటి నిశ్చితార్థం?

  • Published Jul 02, 2024 | 8:51 AM Updated Updated Jul 02, 2024 | 8:51 AM

Actress Sunaina: ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్న విషయం తెలిసిందే. వీరి బాటలోనే ప్రముఖ నటి త్వరలో పెళ్లిపీటలెక్కబోతుంది

Actress Sunaina: ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్న విషయం తెలిసిందే. వీరి బాటలోనే ప్రముఖ నటి త్వరలో పెళ్లిపీటలెక్కబోతుంది

  • Published Jul 02, 2024 | 8:51 AMUpdated Jul 02, 2024 | 8:51 AM
దుబాయ్ య్యూటుబర్‌తో ప్రముఖ నటి నిశ్చితార్థం?

వెండితెర, బుల్లితెర పరిశ్రమకు చెందిన ప్రముఖులు చాలా వరకు తమ సహ నటులను ప్రేమించి కొంత కాలం రిలేషన్ లో ఉండి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. మరికొంత మంది సినీ సెలబ్రెటీలు సీక్రెట్ గా పెళ్లిళ్లు చేసుకుంటూ కొన్నిరోజుల తర్వాత సోషల్ మీడియాలో రివీల్ చేస్తున్నారు. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది తాము ప్రేమించిన వారితో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే దుబాయ్‌కి చెందిన ఓ స్టార్ యూట్యూబర్‌ని ప్రముఖ నటి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆ యూట్యూబర్ ఎవరు? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఇటీవల సెలబ్రెలు ప్రేమ పెళ్లిళ్లు, నిశ్చితార్థాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ కోలీవుడ్ నటి సునయన గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ‘రంగే బారే తుంగే బారే’ కన్నడ మూవీతో బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు తెలుగు, తమిళ, మలయాళంలో వరుసగా సినిమాల్లో ఛాన్సు దక్కించుకుంటూ మంచి విజయాలు అందుకుంది. సోమవారం (జులై 1) నటి సునయన.. సౌదీ అరేబియా, దుబాయ్ కి చెందిన ప్రముఖ యూట్యూబర్ ఖలీద్ అల్ అమెరీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తునున్నాయి. ఈ విషయాన్ని సునయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నట్లు వార్తల సారాంశం.

గత నెల జూన్ 5న సునయన రెండు చేతులు ఒకరినొకరు పట్టున్నట్లు గా ఉన్న ఓ ఫోటో షేర్ చేసింది. అప్పట్లో వీరి ఇద్దరి ప్రేమాయణం పీక్ స్టేజ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమెకు కాబోయే భర్త ఎవరు అన్న విషయంపై క్లారిటీ రాలేదు. తర్వాత జూన్ 26 న యూట్యూబర్ ఖలీద్ డైమండ్ రింగ్ తోడిగిన ఓ అమ్మాయి చేయి పట్టుకున్న ఫోటో పోస్ట్ చేయగా.. వీరిద్దరి నిశ్చితార్థం పూర్తయ్యిందని అధికారికంగా స్పష్టమైనట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నట్లు కన్ఫామ్ అయ్యింది. దీంతో పలువురు సెలబ్రెటీలు, అభిమానులు, నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక యూట్యూబర్ ఖలీద్ అల్ అమెరీ విషయానికి వస్తే.. స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయెట్, సలామా ఒకప్పుడు మిడిల్ ఈస్ట్ లో మిలియన్ల మందితో స్టార్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఖలీద్ కి ఇదివరకే పెళ్లైంది.. ఆమె పేరు సలామా మొహమ్మద్. కాకపోతే వీరి మధ్య కొంత కాలంగా విభేదాలు రావడంతో ఫిబ్రవరి 14, 2024 లో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. హైదరాబాద్ కి చెందిన సునయన 2008 నుంచి తమిళ ఇండస్ట్రీలో వరుస ఛాన్సులు దక్కించుకుంది. తెలుగులో 10వ తరగతి, రాజా రాజా చోర వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల అమెజాన్ లో ప్రైమ్ లో వచ్చిన ‘ఇన్స్‌పెక్టర్ రిషి’ వెబ్ సీరీస్ లో నటించింది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş