iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా ప్రొడ్యూసర్ ని పెళ్లాడిని స్టార్ హీరోయిన్!

  • Published Mar 08, 2024 | 5:58 PM Updated Updated Mar 08, 2024 | 5:58 PM

Heroine Married to a Producer: ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో పెళ్లి వేడుకలు జోరందుకున్నాయి. వెండితెర, బుల్లితెర నటీనటులు వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు.

Heroine Married to a Producer: ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో పెళ్లి వేడుకలు జోరందుకున్నాయి. వెండితెర, బుల్లితెర నటీనటులు వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు.

  • Published Mar 08, 2024 | 5:58 PMUpdated Mar 08, 2024 | 5:58 PM
సైలెంట్ గా ప్రొడ్యూసర్ ని పెళ్లాడిని స్టార్ హీరోయిన్!

ఇటివల సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. బుల్లితెర, వెండితెర నటీనటులతో పాటు దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు పెళ్లి చేసుకొని వివాహబంధంలోకి అడుపెడుతున్నారు. ఇందులో చాలా వరకు తమ సహనటులను ప్రేమించి పెద్దలను ఒప్పటించి పెళ్లి చేసుకుంటున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకునేవారు మరికొంతమంది ఉన్నారు. ఈ వివాహ వేడుకలకు పలువురు సెలబ్రెటీలు, బంధువులు హాజరవుతున్నారు. మెహందీ మొదలు కొని పెళ్లి బారాత్ వరకు ప్రతి ఒక్కటి తమ అభిమానులు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సుఖ్‌మణి సదానా వివాహబంధంలోకి అడుగు పెట్టింది. వివరాల్లోకి వెళితే..

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల జోరు ఓ రేంజ్ లో మొదలైంది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన నటీమణులు ఒక్కొక్కరూ వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే రకూల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడింది. మీరా చోప్రా, కృతి కర్బంగా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టేందుకు సిద్దమయ్యారు. అంతేకాదు  ఇటీవల బుల్లితెర నటీనటులు వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  తాజాగా బాలీవుడ్ అందాల భామ సుఖ్‌మణీ సదానా వివాహబంధంలోకి అడుగు పెట్టింది. ప్రముఖ నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి అచిన సన్నీ గిల్ ను మార్చి 3, 2024 పెళ్లాడింది. వీరి వివాహం అమృత్‌సర్ లో జరిగింది.

ప్రొడ్యూసర్ ని సైలెంట్ పెళ్లి చేసుకున్న సుఖ్‌మణీ సదానా ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. తన పెళ్లి ఫోటోలను ఇన్ స్ట్రా వేధికగా అభిమానులకు పంచుకుంది. మా జీవితంలో అత్యంత అందమైన రోజు ఇది.. మీ అందరి ఆశిస్సులు, ప్రేమాభిమానాలు కావాలంటూ పోస్ట్ చేసింది. సుఖ్‌మణీ సదానా ‘సాక్రెడ్ గేమ్స్’ వెబ్ సీరీస్ తో మంచి పేరు సంపాదించుకుంది. జోగి, రాకెట్రీ వంటి చిత్రాలకు స్క్రిప్ట్ అందించారు. తాండవ్, తనవ్, మన్మర్జియాన్, ఉడాన్ పటోలాస్ లాంటి షోల్లో కనిపించింది. వివాహబంధంలోకి అడుగు పెట్టిన ఈ జంటకు సెలబ్రెటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sukhmani Sadana (@sukhmanisadana)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş