iDreamPost
android-app
ios-app

నా డివోర్స్ కి తనే కారణం.. క్షమించను! స్టార్ హీరోయిన్ పై నటి ఫైర్

  • Author Soma Sekhar Published - 04:48 PM, Wed - 12 July 23
  • Author Soma Sekhar Published - 04:48 PM, Wed - 12 July 23
నా డివోర్స్ కి తనే కారణం.. క్షమించను! స్టార్ హీరోయిన్ పై నటి ఫైర్

ఇండస్ట్రీలో ఓ హీరో, మరో హీరోపై అలాగే ఓ నటి మరో నటిపై విమర్శలు చేయడం సాధారణమే. కానీ తాజాగా ఓ నటి చేసిన కామెంట్స్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా నిలిచాయి. డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ నటి 2007 అతడికి విడాకులు ఇచ్చింది. అయితే తాను విడాకులు తీసుకోవడానికి కారణం ఓ స్టార్ హీరోయిన్ అని సంచలన కామెంట్స్ చేసింది. మా మధ్య ఆ హీరోయిన్ రావడం మూలంగానే మేం డైవర్స్ తీసుకోవాల్సి వచ్చిందని సదరు నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. మా డైవర్స్ కు కారణం అయిన ఆమెను క్షమించనంటూ మండిపడింది. మరి డైవర్స్ తీసుకున్న ఆ నటి ఎవరు? విడాకులకు కారణం అయిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

సుచిత్రా కృష్ణమూర్తి.. ప్రముఖ గాయనిగా, చిత్రకారిణి గా, నటిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే 1999లో డైరెక్టర్ శేఖర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అతడికి 2007లో విడాకులు ఇచ్చింది సుచిత్రా. శేఖర్ కపూర్ ఆమె కంటే 30 ఏళ్లు పెద్దవాడు కావడం గమనార్హం. పెళ్లి ముందు వరకు మంచి నటిగా క్రేజ్ సంపాదించుకున్న సుచిత్ర.. వివాహం తర్వాత భర్త పెట్టిన కండీషన్ తో నటనకు ముగింపు పలికింది. ఈ దంపతులకు ఒక కూతురు కూడా ఉంది. కొంతకాలం తర్వాత అతడి ప్రేమలో నిజాయితీ లేదని అతడికి విడాకులు ఇచ్చింది.

అయితే తన విడాకులకు కారణం స్టార్ హీరోయిన్ ప్రీతిజింటా అని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిప్పులు చెరిగింది. తన విడాకులకు కారణం హీరోయిన్ ప్రీతిజింటానే అని, ఆమెను ఇప్పటికీ క్షమించను అంటూ చెప్పుకొచ్చింది. మా భార్యాభర్తల మధ్య ప్రీతిజింటా రావడం కారణంగానే మేం డైవర్స్ తీసుకున్నాం అని వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలను ప్రీతిజింటా తిప్పికొట్టింది. నేను నెంబర్.1 హీరోయిన్ గా ఉన్నప్పుడు కనీసం నువ్వు సినిమాల్లో కూడా యాక్ట్ చేయలేదని, నువ్వు ఓ సాధారణ గృహిణివి, సుచిత్రా ఇష్టం వచ్చినట్లు మాట్లడకు. నీ మానసిక స్థితి సరిగ్గా లేదు మంచి సైకియాటిస్ట్ కు చూపించుకో అని ప్రీతిజింటా కౌంటర్ ఇచ్చింది.

కాగా.. ఈ కౌంటర్ పై కూడా తాజా ఇంటర్వ్యూలో స్పందించింది సుచిత్ర. ప్రీతిజింటా మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదని, ప్రపంచంలో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చని సుచిత్ర పేర్కొంది. ఒక గృహిణిగా, 20 ఏళ్లు తల్లిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని ఆమె తెలిపారు. ఇక ఎవరెన్ని మాట్లాడినా.. సత్యానికే బలం ఉంటుందని, చివరికి సత్యమే గెలుస్తుందని, ఇప్పటికీ నేను ఆమెను క్షమించను అంటూ సుచిత్రా ప్రీతిజింటాపై ఫైర్ అయ్యింది. మరి తన విడాకులకు కారణం ప్రీతిజింటానే అన్న నటి సుచిత్ర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఈ చిన్నారిని గుర్తుపట్టారా? కొంచం దృష్టిపెడితే పాన్ ఇండియా స్టార్ అనిపిస్తుంది!

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş