iDreamPost
android-app
ios-app

క్యాస్టింగ్‌ కౌచ్‌పై ప్రముఖ నటి.. ఆ డైరెక్టర్ నాతో అసభ్యంగా..

  • Published Mar 08, 2024 | 7:16 PM Updated Updated Mar 08, 2024 | 7:16 PM

Actress Sreejita De Comments: సినీ ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి మట్లాడుతుంటారు. గతంలో తమకు ఎదురైన ఛేదు అనుభవాల గురించి సెన్సెషన్ కామెంట్స్ చేస్తున్నారు

Actress Sreejita De Comments: సినీ ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి మట్లాడుతుంటారు. గతంలో తమకు ఎదురైన ఛేదు అనుభవాల గురించి సెన్సెషన్ కామెంట్స్ చేస్తున్నారు

  • Published Mar 08, 2024 | 7:16 PMUpdated Mar 08, 2024 | 7:16 PM
క్యాస్టింగ్‌ కౌచ్‌పై ప్రముఖ నటి.. ఆ డైరెక్టర్ నాతో అసభ్యంగా..

క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పెనుభూతం. హీరోయిన్లు.. ఇతర క్యారెక్టర్ పాత్రల్లో నటించేందుకు అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను పడకగదికి పిలిపించుకునే ప్రక్రియనే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కి గురైనా వాళ్లు సమాజాంలో పరువు పోతుందని తమలో తామే బాధపడేవారు. ఎప్పుడైతే మీటూ ఉద్యమం వచ్చిందో.. అప్పటి నుంచి క్యాస్టింగ్ కౌచ్ ఎంతోమంది నటీమణులు తమ గళం విప్పారు.  గతంలో తమకు జరిగిన అన్యాయాల గురించి  మీడియా వేధికగా వెల్లడించారు. ప్రముఖ నటి తనకి ఎదురైనా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. వివరాల్లోకి వెళితే..

టెలివిజన్ రంగంలో బిగ్గెస్ రియాల్టీ షో బిగ్ బాస్ బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు 17 సీజన్లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ 16 కంటెస్టెంట్ శ్రీజిత దే తాను సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎదుర్కొన్ని చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. ఓ సినిమా ఆఫర్ కోసం వెళ్తే డైరెక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. శ్రీజిత మాట్లాడుతూ.. ‘నేను 17 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశాను. మాది పశ్చిమ బెంగాల్ లోని హల్దియా అనే చిన్న ఊరు. మా అమ్మ నాకు ప్రతి విషయంలో సహకరిస్తూ వెన్నంటి ఉండేది. మా అమ్మతో నేను ఏదీ దాచుకోకుండా చెప్పేదాన్ని. ఇండస్ట్రీలో నాకు అనూహ్యంగా ఛాన్స్ దక్కింది. ఆ సమయంలో ప్రాజెక్టులు లేకున్నా నన్ను కలవాలని పిలిచి కొంతమంది మూర్ఖులు పైశాచిక ఆనందం పొందేవారు. ఆ సమయంలో ఓ డైరెక్టర్ తో సినిమా ఉందంటూ కమిట్ మెంట్ అడిగేవారు. అలాంటి అనుభవం నాకు రెండు సార్లు ఎదురైంది’ అని చెప్పుకొచ్చింది.

శ్రీజిత మాట్లాడుతూ.. ‘అప్పుడు నాకు 19 ఏళ్లు.. బాలీవుడ్ మూవీ రిమేక్ ఆఫర్ వచ్చింది.. దర్శకుడు నన్ను సీన్ల గురించి వివరించేందుకు రమ్మని పిలిచాడు. ఆ సమయంలో నా వెంట అమ్మలేదు. నేను ఒంటరిగా డైరెక్టర్ ఆఫీస్ కి వెళ్లాను. అప్పుడు డైరెక్టర్ నీ వెంట ఎవరూ రాలేదా? అని అడిగాడు. లేదు అని చెప్పగానే.. మెల్లిగా నా భుజంపై చేయి వేసి నిమిరాడు.. అలా నా ఒంటిపై చేయి వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. అతడు నాకన్నా వయసులో చాలా పెద్ద. అప్పుడు అనుకున్నా.. మగ బుద్ది వంకర బుద్ది అని. మెల్లిగా అతని నుంచి తప్పించుకొని ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయాను. అయితే క్యాస్టింగ్ కౌచ్ కి నేను లొంగలేదు.. ఎవరికీ భయపడలేదు’ అని చెప్పింది. ఇక శ్రీజిత కెరీర్ విషయానికి వస్తే.. 2007 లో కసౌతి జిందగీ కె అనే షోతో బుల్లితెరపై తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది. లేడీస్ స్పెష్ల, లాల్ ఇష్క్, ఉత్తరాన్, తుమ్ హి హూ బంధు సఖ్ తుమ్హీ, యే జాదూ హై జిన్ కా వంటి టివీ షోల్లో పాల్గొంది. తషాన్, లవ్ కా ది ఎండ్, రెస్క్యూ, మాన్సూన్ షూటౌట్ వంటి సినిమాల్లో నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Sreejita De Blohm-Pape (@sreejita_de)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio