iDreamPost
android-app
ios-app

ప్రముఖ వ్యాపారవేత్తతో టాలీవుడ్ హీరోయిన్ వివాహం!

  • Published Feb 19, 2024 | 3:03 PM Updated Updated Feb 19, 2024 | 3:03 PM

Sonarika Bhadoria Married Her Boyfriend: ఈ మధ్య కాలంలో చాలా వరకు వెండితెర, బుల్లితెర కు చెందిన చాలా మంది నటీనటులు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్లు వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకుంటున్నారు.

Sonarika Bhadoria Married Her Boyfriend: ఈ మధ్య కాలంలో చాలా వరకు వెండితెర, బుల్లితెర కు చెందిన చాలా మంది నటీనటులు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్లు వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకుంటున్నారు.

  • Published Feb 19, 2024 | 3:03 PMUpdated Feb 19, 2024 | 3:03 PM
ప్రముఖ వ్యాపారవేత్తతో టాలీవుడ్ హీరోయిన్ వివాహం!

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఈ మద్య వరుసగా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. చాలామంది తమ సహనటులను ప్రేమించి కొంత కాలం రిలేషన్ షిప్ లో ఉండి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. మరికొంతమంది హీరోయిన్లు  పెద్దల కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. గత రెండేళ్లుగా బాలీవుడ్ కి చెందిన చాలామంది సెలబ్రెటీలు తాము ప్రేమంచిన వారిని పెళ్లాడారు.   ఒకప్పుడు బుల్లితెరపై ‘దేవోన్ కే దేవ్…మహాదేవ్‌’ సీరియల్  ట్రెండ్ సృష్టించింది. ఈ సీరియల్ లో పార్వతి పాత్రలో నటించిన సోనారిక భడోరియాకి మంచి క్రేజ్ వచ్చింది. తర్వాత వెండితెరపై వరుస ఛాన్సులు కూడా వచ్చాయి.  తాజాగా సోనారిక భడోరియా వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సీరియల్స్ వచ్చాయి.. కానీ కొన్ని సీరియల్స్ ఎప్పటికీ మర్చిపోలేని గుర్తింపు తెచ్చుకున్నాయి. అలాంటి వాటిలో 2012లో వచ్చిన ‘దేవోన్ కే దేవ్…మహాదేవ్‌’ సీరియల్. ఇందులో శివుడి భార్యగా పార్వతి పాత్రలో నటించిన సోనారిక భడోరియాకి ఎంతో గొప్ప పేరు వచ్చింది. ఆ క్రేజ్ తో సినీ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే 2015లో నాగశౌర్య నటించిన ‘జాదుగాడు’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్పీడున్నోడు, ఈడో రకం ఆడో రకం మూవీలో నటించింది. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో సాన్సెన్, హిందుత్వ లో నటించింది. కోలీవుడ్ లో ఇంద్రజీత్ మూవీలో నటించింది. తర్వాత ఎక్కువగా బాలీవుడ్ సీరియల్స్ లో నటించింది. ఇటీవల ప్రముఖ వ్యాపార వేత్త వికాస్ పరశార్ తో త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రకటించింది.

నటి సొనారిక భడోరియా  ఫిబ్రవరి 18 న రాజస్థాన్ రణతంబోర్ లో తాను కోరుకున్న ప్రియుడు, ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ పరశార్ తో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. గోవాలో రోకా వేడుక తర్వాత వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అంతకు ముందు హల్దీ, మెహిందీ తదితర ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వెండితెర, బుల్లితెర సెలబ్రెటీలు హాజరయ్యారు. పెళ్లి సమయంలో సొనారిక భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ అభిమాన నటి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టినందుకు అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు అందిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Yami♥️Craziest Sonarikan♥️ (@sonakifan)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet