iDreamPost
android-app
ios-app

ఒకసారి కట్టిన బట్టలు మళ్లీ కట్టని హీరోయిన్ ఎవరో తెలుసా!

  • Published May 14, 2024 | 10:06 PM Updated Updated May 14, 2024 | 10:06 PM

హీరోయిన్ స్నేహ గురించి పరిచయం అక్కర్లేదు. పలు సూపర్ హిట్ చిత్రాలో నటించిన స్నేహ పాపులర్ హీరోయినగా పేరు సంపాదించుకుంది. నటి స్నేహ తన దుస్తులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హీరోయిన్ స్నేహ గురించి పరిచయం అక్కర్లేదు. పలు సూపర్ హిట్ చిత్రాలో నటించిన స్నేహ పాపులర్ హీరోయినగా పేరు సంపాదించుకుంది. నటి స్నేహ తన దుస్తులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఒకసారి కట్టిన బట్టలు మళ్లీ కట్టని హీరోయిన్ ఎవరో తెలుసా!

సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది నటీనటులు వస్తుంటారు వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ స్నేహ ఒకరు. చెరగని చిరునవ్వుతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది. అందం అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది నటి స్నేహ. సినిమాల్లో గ్లామర్ షోకు తావివ్వకుండా కట్టుబొట్టుతో నిండైన తెలుగుదనం ఉట్టిపడేలా స్నేహ నటించి మెప్పించింది. అయితే నటి స్నేహ తన బట్టలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒకసారి కట్టుకున్న చీరను మరోసారి ముట్టుకోనని తెలిపింది. దీనికి గల కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే.

తెలుగులో తొలివలపు సినిమాతో పరిచయమైన హీరోయిన్ స్నేహ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో సినీ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్లింది. అయితే పెళ్లి తర్వాత కుటుంబానికే పరిమితమైన స్నేహ సినిమాలకు విరామం ఇచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ హీరోలకు అక్క, వదినగా మంచి పాత్రలలో అలరిస్తుంది. కో యాక్టర్ గా రాణిస్తూనే అటు బుల్లితెరపై సందడి చేస్తుంది. కాగా నటి స్నేహ తను కట్టుకునే చీరలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఒక ప్రముఖ మ్యాగజైన్ స్నేహ తరచుగా ఓకే దుస్తులను ధరిస్తుందని వేరే బట్టలు లేవని రాసుకొచ్చిందట. తన దుస్తులపై చాలా విమర్శలు వచ్చాయని అందుకే ఒకసారి ధరించిన బట్టలు మళ్లీ ధరించనని తెలిపింది. ఒకసారి ధరించిన దుస్తులను తెలిసిన వారికి, తన స్నేహితులకు ఇస్తానని చెప్పుకొచ్చింది. హీరో ప్రసన్నతో ప్రేమ వివాహం చేసుకుంది నటి స్నేహ. వీరిద్దరు 2012లో కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి విగాన్ అనే కుమారుడు, ఆద్యంత కుమార్తె ఉన్నారు. ఈమె నటించిన సినిమాలలో సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş