iDreamPost
android-app
ios-app

ఒక్క సినిమా హిట్టుతో.. ప్రధాని మోదీని మించిపోయిన ప్రభాస్‌ హీరోయిన్‌!

  • Published Aug 21, 2024 | 4:24 PM Updated Updated Aug 21, 2024 | 4:24 PM

Shraddha Kapoor: సోషల్ మాధ్యమాలు వచ్చిన తర్వాత సెలబ్రెటీల ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. తాజాగా శ్రద్దా కపూర్ మరో అరుదైన ఘనత సాధించింది.

Shraddha Kapoor: సోషల్ మాధ్యమాలు వచ్చిన తర్వాత సెలబ్రెటీల ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. తాజాగా శ్రద్దా కపూర్ మరో అరుదైన ఘనత సాధించింది.

  • Published Aug 21, 2024 | 4:24 PMUpdated Aug 21, 2024 | 4:24 PM
ఒక్క సినిమా హిట్టుతో.. ప్రధాని మోదీని మించిపోయిన ప్రభాస్‌ హీరోయిన్‌!

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారికి ఇన్‌స్టా, ఫేస్ బుక్ ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు. మన దేశంలో ఇన్ స్ట్రాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది ఎవరంటే స్టార్ క్రికెటర్ కోహ్లీ. ప్రస్తుతం కోహ్లీకి 270 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఈమెకు 91.8 మిలియన్లు, ప్రధాన నరేంద్ర మోదీకి 91.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా మూడో స్థానానికి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ చేరుకున్నారు. ‘స్త్రీ 2’ మూవీ సక్సెస్ తో ఈమె ఫాలోవర్స్ సంఖ్య 91.4 మిలియన్లకు పెరిగిపోయింది. దీంతో ప్రధాని మోదీని అధిగమించినట్లయ్యిందని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రపంచ దేశాల్లో ఎంతో ప్రభావితమైన వ్యక్తుల్లో ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా చుట్టూ అభిమానులు చేరుతారు.  సోషల్ మీడియాలో మోదీకి మంచి గుర్తింపు ఉంది. ప్రధాని మోదీకి ఇన్ స్ట్రాలో దాదాపు 91.3 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే.. ఇప్పుడు దీన్ని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంది నటి శ్రద్దా కపూర్. ప్రస్తుతం ఇన్ స్ట్రాలో కోహ్లీ మొదటి స్థానం, ప్రియాంక చోప్రా రెండో స్థానం.. మూడో స్థానంలోకి శ్రద్దా కపూర్ వచ్చి చేరింది. ఆలియా భట్ కు 85.1 మిలియన్లు, దీపికా పదుకొనెకి 79.8 మిలియన్ల మంది ఫాలోవర్సు ఉన్నారు. కాకపోతే ట్విట్టర్ లో మాత్రం 101.2 మిలియన్ల ఫాలోవర్లతో ప్రధాని మోదీ తొలి స్థానంలో ఉండటం విశేషం.

బాలీవుడ్ ప్రముఖ నటుడు శక్తి కపూర్ కూతురు శ్రద్ద కపూర్. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘సాహూ’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది శ్రద్దా కపూర్. ఆ తర్వాత మళ్లి కనిపించలేదు. గతంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన స్త్రీ మూవీకి సీక్వెల్ గా అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘స్త్రీ 2 ’ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అయి బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. రిలీజ్ అయిన ఐదు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన శ్రద్ద కపూర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. హర్రర్, కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş