iDreamPost
android-app
ios-app

ఆ స్టార్ హీరోతో నగ్నంగా ఫోటోషూట్ చేయాలనుంది: నటి షెర్లిన్ చోప్రా

  • Author ajaykrishna Updated - 09:46 AM, Mon - 31 July 23
  • Author ajaykrishna Updated - 09:46 AM, Mon - 31 July 23
ఆ స్టార్ హీరోతో నగ్నంగా ఫోటోషూట్ చేయాలనుంది: నటి షెర్లిన్ చోప్రా

కొన్నిసార్లు హీరోయిన్స్ చేసే వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఎలాంటి పెను దుమారం రేపుతుంటాయో తెలిసిందే. హీరోల గురించి, కాస్టింగ్ కౌచ్ గురించి కాంట్రవర్సీ కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తుంటారు. కొందరు మాత్రం వాళ్ల కోరికలను బయటకి చెప్పి హైలైట్ అయిపోతుంటారు. సరే.. హీరోయిన్స్ కోరికలు వాళ్ల వరకు ఆగితే బాగానే ఉంటుంది. కానీ.. ఒక్కోసారి కోరికలు గుర్రాలయితే అన్నట్లు హద్దులు దాటిపోతుంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ కల్చర్ లో ఎక్కువగా మనం పెళ్ళైన హీరోలతో లేదా స్టార్డమ్ లో ఉన్న హీరోలతో అలా చేయాలనుంది.. ఇలాంటి కోరికలు ఉన్నాయంటూ కాంట్రవర్సీలకు తెర లేపుతుంటారు ముద్దుగుమ్మలు.

హీరోయిన్స్ కోరుకోవడం వరకు ఓకే.. జనరల్ గా ఫ్యాన్స్ లాగే తమ అభిమాన హీరోలతో కనీసం ఫోటోలు దిగడం, ఫోటోషూట్స్ చేయడం లాంటివి తప్పు లేదు. కానీ.. ఫలానా స్టార్ హీరోతో నగ్నంగా ఫోటోషూట్ చేయాలనీ ఉందంటూ వ్యాఖ్యలు చేయడం ఎలాంటి చర్చలకు దారితీస్తాయో తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా.. ఓ స్టార్ హీరోతో నగ్నంగా ఓ ద్వీపంలో రాత్రి వేళలో ఫోటోషూట్ చేయాలనుందని చెప్పి ఒక్కసారిగా బి టౌన్ ఉలిక్కిపడేలా చేసింది. ఇంతకీ షెర్లిన్ కోరుకుంటున్న హీరో ఎవరంటే.. బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్. అతనితో అలాంటి ఫోటోషూట్ చేయాలనేది తన కోరిక అంటూ రీసెంట్ గా ఓ మీడియా మీటింగ్ లో చెప్పిందట అమ్మడు.

షెర్లిన్ మాట్లాడుతూ.. “నాకు రన్వీర్ తో కలిసి పనిచేయాలని ఉంది. అతను ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగా పోజులిచ్చినప్పుడు మెచ్చుకున్న జనాలు.. మేం అర్ధనగ్నంగా కనిపించినా దుర్భాషలాడుతారు. అప్పట్లో ఓ మ్యాగజైన్ కోసం రన్వీర్ సింగ్ చేసిన ఫొటోషూట్ బాగా పాపులర్ అయ్యింది. లేడీస్ పైట జారితేనే.. అరిచే జనాలు అతని ఫోటోషూట్ గురించి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇక్కడే వివక్ష చూపుతున్నారని అర్ధమవుతుంది. నేను రన్వీర్ వర్క్ చేయాలని అనుకున్నది నిజం. ఓ అందమైన ద్వీపంలో అతనితో ఏకాంతంగా ఫోటోషూట్ చేయడం సరదాగా ఉంటుంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం షెర్లిన్ కామెంట్స్ చర్చనీయంశంగా మారాయి. కాగా.. షెర్లిన్ తెలుగు ప్రేక్షకులకు ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ అనే మూవీతో పరిచయమే. మరి షెర్లిన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio