iDreamPost
android-app
ios-app

తండ్రి కాబోతున్న మీర్జాపూర్ నటుడు అలీ ఫైజల్.. పోస్ట్ వైరల్

  • Published Feb 09, 2024 | 9:38 PM Updated Updated Feb 10, 2024 | 10:34 AM

Richa Chadha Announce Pregnancy: ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటీమణులు లేటు వయసులో తల్లులు అవుతున్నారు.. ఆ లీస్ట్ లో చేరింది బాలీవుడ్ బ్యూటీ.

Richa Chadha Announce Pregnancy: ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటీమణులు లేటు వయసులో తల్లులు అవుతున్నారు.. ఆ లీస్ట్ లో చేరింది బాలీవుడ్ బ్యూటీ.

  • Published Feb 09, 2024 | 9:38 PMUpdated Feb 10, 2024 | 10:34 AM
తండ్రి కాబోతున్న మీర్జాపూర్ నటుడు అలీ ఫైజల్.. పోస్ట్ వైరల్

సినీ ఇండస్ట్రీలో చాలా వరకు ప్రేమ వివాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వెండితెర, బుల్లితెర నటీనటులు తమ సహ నటులను కొంతకాలం వరకు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. మరికొంతమంది సెలబ్రెటీలు తమ పెద్దల మాటకు గౌరవం ఇస్తూ వారు ఇష్టపడ్డ సంబంధాలే చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకున్న జంట సంతానం విషయంలో చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. దీంతో లేటు వయసులో మాతృత్వపు ఆనందాన్ని పొందుతున్నారు. బాలీవుడ్ నటి తన 37వ ఏట తల్లికాబోతున్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

అలీ ఫజల్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ‘మీర్జాపూర్’ వెబ్ సీరీస్. ఇందులో అలీ గుడ్డు పండిట్ పాత్రలో నటించాడు. హాలీవుడ్ లో ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ లో చిన్న పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత 3 ఇడియట్స్ లో క్యారెక్టర్ పాత్రలో నటించాడు. తర్వాత ఆల్వేస్ కభీ కభీ, బాత్ బన్ గయా, బాబీ జాసూస్ లో నటించాడు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన మీర్జాపూర్ లో గుడ్డు పండిట్ పాత్ర అలీకి బాగా పేరు తెచ్చింది. తన సహనటి రిచా చద్దాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అభిమానులకు ఈ జంట ఓ గుడ్ న్యూస్ చెప్పారు.  ఇక బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా బీ టౌన్ లో కొత్తగా పరిచయం అక్కరలేదు. నటి, నిర్మాత, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. 2008లో ఓయే లక్కీ అనే కామెడీ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించిన రిచా చద్దా. 2012 లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ పార్ట్ 1 లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. నిర్దోషి అనే కన్నడ సినిమాలో నటించింది. గత ఏడాది ఫర్కీ-3 మూవీతో అభిమానులను అలరించింది. ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న వెబ్ సీరీస్ హీరామడిలో కీలక పాత్రలో కనిపించబోతుంది. త్వరలో ఈ వెబ్ సీరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

బాలీవుడ్ నటుడు అలీ ఫైజల్ ని ప్రేమించి 2022 లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. తాజాగా ఈ రిచా చద్దా తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేధికగా వెల్లడించింది. 2013 లో రిలీజ్ అయిన ఫర్కీ మూవీలో నటించే సమయంలో ఫైజల్ – రిచా చద్దాల మధ్య స్నేహం ప్రేమగా మారింది. చాలా కాలం వరకు ఈ జంట సహజీవనం కొనసాగించారు. తర్వాత పంజాబీ, లక్నో సంప్రదాయ ప్రకారం ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహంచారు. పెళ్లి తర్వాత సినీ ప్రముఖుల కసం ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. రిచా చద్దా సినిమాల విషయానికి వస్తే.. నెట్ ఫ్లిక్స్ భారత్ లో తెరకెక్కించిన ఒరిజినల్ షో కాల్ మై ఏజెంట్ లో నటించింది. రిచా చెద్దా పోస్ట్ చూసి ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ali fazal (@alifazal9)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom