iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటి రమాప్రభ ఇంట తీవ్ర విషాదం!

  • Published Oct 17, 2024 | 6:12 PM Updated Updated Oct 17, 2024 | 6:12 PM

Actress Ramaprabha: ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యనే స్టార్ కమెడియన్ రాజేంద్ర ప్రసాద్ కూతురు

Actress Ramaprabha: ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యనే స్టార్ కమెడియన్ రాజేంద్ర ప్రసాద్ కూతురు

  • Published Oct 17, 2024 | 6:12 PMUpdated Oct 17, 2024 | 6:12 PM
ప్రముఖ నటి రమాప్రభ ఇంట తీవ్ర విషాదం!

గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగాని చెందిన వారు.. వారి కుటుంబ సభ్యులు కన్ను మూయడంతో అటు వారి కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. ఇందులో చాలా వరకు వయోభారం, గుండెపోటు, అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల వల్ల సెలబ్రెటీలు, వారి బంధువులు కన్నుమూస్తున్నారు. గత రెండు నెలల వ్యవధిలోనే వరుసగా బాలీవుడ్ నటి ఆశా వర్మ, నటుడు వికాస్ సథీ, నిర్మల్ బెన్నీ, కమెడియన్ బిజిలి రమేష్, స్టార్ ప్రొడ్యూసర్ ఢిల్లీ బాబు, సీఐడీ శంకుతల కన్ను మూశారు. ఈ మధ్యనే ప్రముఖ హాస్యనటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నటి రమాప్రభ ఇంట విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన ప్రాత్లోల నటించి ప్రేక్షకులను మెప్పించారు రమాప్రభ. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ కొన్ని సినిమాల్లో హీరోయిన్, సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇండస్ట్రీలో రాజబాబు, పద్మనాభం, చలం లాంటి స్టార్ కమెడియన్లతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు రమాప్రభ. పూరీ జగన్నాథ్  మూవీస్  లో ఎక్కువగా కనిపించారు. తాజాగా రమాప్రభ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరి కుమారుడు సురేష్ ఆకస్మికంగా కనుమూశారు. ఈ మధ్యనే ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు (38) గాయత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ని పరామర్శించడానికి రమాప్రభ వచ్చారు.గాయత్రికి సంబంధించిన పెద్ద కర్మ కార్యక్రమంలో సురేష్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనకు స్వల్ప అస్వస్థత చోటు చేసుకుంది. గత తొమ్మిది నెలలుగా సురేష్ కిడ్నీ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయన కన్నుమూశారు. రమాప్రభ సమర్పణలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘అప్పుల అప్పారావు’ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు సురేష్. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom