iDreamPost
android-app
ios-app

ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్! మీ కళ్ళని మీరే నమ్మలేరు!

  • Published May 16, 2024 | 1:45 PM Updated Updated May 16, 2024 | 1:45 PM

ఈ ఫోటోలో స్కూల్ యూనిఫాం ధరించి.. రెండు జడలు వేసుకుని కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్. అప్పట్లో అలా ఉన్న ఈ పాప.. ఇప్పుడు చూస్తే మీ కళ్లని మీరే నమ్మలేరు.. ఇంతకు ఎవరంటే..?

ఈ ఫోటోలో స్కూల్ యూనిఫాం ధరించి.. రెండు జడలు వేసుకుని కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్. అప్పట్లో అలా ఉన్న ఈ పాప.. ఇప్పుడు చూస్తే మీ కళ్లని మీరే నమ్మలేరు.. ఇంతకు ఎవరంటే..?

  • Published May 16, 2024 | 1:45 PMUpdated May 16, 2024 | 1:45 PM
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్! మీ కళ్ళని మీరే  నమ్మలేరు!

దక్షిణాది ఇండస్ట్రీలో అతి పెద్ద సినీ పరిశ్రమగా ఎదగడంతో పాటు బీటౌన్‌ను కూడా నిద్ర లేకుండా చేస్తోంది టాలీవుడ్. ఒకప్పుడు తెలుగు పరిశ్రమ అంటే చిన్న చూపు చూపించే బాలీవుడ్.. ఇప్పుడు ఇక్కడ కథలతో, డైరెక్టర్లతో, టెక్నీషియన్లతో వర్క్ చేస్తోంది. అంతేనా.. ఇక్కడి కాస్తో కూస్తో ఫేమస్ అయిన బ్యూటీలకు కూడా రెడ్ కర్చీఫ్ వేస్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎంతో మంది ముద్దుగుమ్మలు అక్కడికి క్యూ కట్టిన సంగతి విదితమే. ఇక్కడ గ్లామర్ పాత్రలకు నో చెప్పి.. అక్కడ హద్దులు చెరిపేసి నటిస్తున్నారు. వరుస ఛాన్సులతో బిజీగా మారిపోతూ.. అప్పుడప్పుడు తమకు లైఫ్ ఇచ్చిన టీటౌన్ వైపు తొంగి చూస్తున్నారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న బొద్దుగుమ్మ కూడా ఆ లిస్టులోనిదే.

బూరె బుగ్గలు వేసుకుని, రెండు జడలతో, కళ్లజోడు పెట్టుకుని.. గట్టిగా నవ్వనా.. వద్దా అన్నట్లు చిరునవ్వులు చిందిస్తున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్. కెరీర్ స్టార్ అయిన కొత్తలో కూడా ఇలా బొద్దుగా కనిపిస్తూ మెస్మరైజ్ చేసిన ఈ చిన్నది.. తర్వాత నాజూగ్గా మారుతూ వావ్ అనిపిస్తుంది. ఇప్పుడు వరుసగా హిందీ ప్రాజెక్టులతో .. తెలుగు సినిమాలకు కాల్షీట్లు కేటాయించలేకపోతుంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరంటే.. అందమంతా ఓ చోట పోత పోసినట్లుగా ఉండే రాశి ఖన్నా. మద్రాస్ కేఫ్ అనే హిందీ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ డాళ్.. ఊహలు గుస గుసలాడే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. మనంలో క్యామియో పాత్రలో కనిపించింది. వరుసగా యంగ్ హీరోలతో జతకట్టింది. జోరు, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, హైపర్, జై లవ కుశ, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలి ప్రేమ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. శ్రీనివాస కళ్యాణం తర్వాత తమిళ పరిశ్రమలోకి వచ్చింది. వరుసగా నాలుగు చిత్రాలు చేసింది. మళ్లీ తెలుగులో వెంకీ మామ, ప్రతి రోజు పండుగ, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలు చేసింది. అటు మలయాళంలో కూడా రెండు సినిమాల్లో నటించింది.

పక్కా కమర్షియల్, థాంక్యూ వంటి చిత్రాలతోనే కాకుండా తమిళ డబ్బింగ్ తిరు మూవీతో కూడా పలకరించింది. అంతలో బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. రుద్ర అనే వెబ్ సిరీస్‌తో పాటు ఫర్జీ అనే మూవీ సిరీస్ ఆమె దిశ, దశను మార్చేశాయి. ఈ ఏడాది యోధ అనే హిందీ చిత్రంతో పాటు బాక్ (ఆరణ్మనై4)తో హాయ్ చెప్పింది. ప్రస్తుతం తెలుసు కదా అనే తెలుగు మూవీతో పాటు ఓ తమిళ్, రెండు హిందీ ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. ఆమె కేవలం నటి మాత్రమే కాదు.. సింగర్ కూడా. ఇప్పటికే అనేక సినిమాలకు పాటలు కూడా పాడింది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş