iDreamPost
android-app
ios-app

అదంతా సెలబ్రిటీల పబ్లిసిటీ స్టంట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ప్రియమణి!

  • Published Feb 19, 2024 | 7:50 PM Updated Updated Feb 19, 2024 | 7:50 PM

Priyamani: సెలబ్రిటీల పబ్లిసిటీకి సంబంధించిన స్టంట్ గురించి సంచలన నిజాలు ఈ లోకానికి వెల్లడించించి స్టార్ హీరోయిన్ ప్రియమణి. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో జరిగే పబ్లిసిటీ భాగోతం బయటపెట్టింది.

Priyamani: సెలబ్రిటీల పబ్లిసిటీకి సంబంధించిన స్టంట్ గురించి సంచలన నిజాలు ఈ లోకానికి వెల్లడించించి స్టార్ హీరోయిన్ ప్రియమణి. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో జరిగే పబ్లిసిటీ భాగోతం బయటపెట్టింది.

అదంతా సెలబ్రిటీల పబ్లిసిటీ స్టంట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ప్రియమణి!

సాధారణంగా రాజకీయ ప్రముఖులు, సినిమా హీరోలు, హీరోయిన్ లు ఏదైనా ఫంక్షన్ కు గానీ, లేదా ఇతర కార్యక్రమాలకు హాజరైతే.. పదుల సంఖ్యలో కెమెరాలు వారిని చుట్టుముడతాయి. మరీ ముఖ్యంగా జిమ్స్, ఎయిర్ పోర్టుల్లో నుంచి లేడీ సెలబ్రిటీలు వస్తున్నప్పుడు.. మేడం ఒక్క ఫొటో ప్లీజ్ అంటూ అడుగుతూ ఉంటారు. అయితే అదంతా సెలబ్రిటీల పబ్లిసిటీ స్టంట్ అని, ఆ ఫొటోగ్రాఫర్స్ డబ్బులిస్తే వస్తారని సంచలన నిజాలు బయటపెట్టింది స్టార్ హీరోయిన్ ప్రియమణి. ఆమె చెప్పిన ఇంకొన్ని నిజాలు చూస్తే.. మీరు షాక్ అవుతారు.

సోషల్ మీడియా వాడకం పెరగడంతో.. పబ్లిసిటీ దక్కించుకోవడం అనేది చాలా సులువైపోయింది. ఇక మనం ఇన్ స్టా గ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. హీరోయిన్ లు జిమ్ముల్లోంచి చెమటలు చిందించి బయటకు వచ్చే వీడియోలు కుప్పలు తెప్పలుగా మనకు దర్శనమిస్తాయి. దీంతో చూసేవారు అమ్మో.. ఈ బ్యూటీకి మామూలు ఫాలోయింగ్ లేదుగా అని అనుకుంటారు. అలాగే ఎయిర్ పోర్ట్ ల్లో కూడా దర్శనం ఇస్తూ ఉంటారు కొందరు హీరోయిన్స్. దీంతో జిమ్ము, ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్స్, హీరోలు రాగానే ఫొటోగ్రాఫర్స్ మీద మీద పడి ఫొటోలు తీస్తారుగా.. అసలు అదే టైమ్ కు వాళ్లు వస్తారని వీళ్లందరికి ఎలా తెలుసబ్బా? అని చాలా తక్కువ మందికి మాత్రమే అనుమానం వచ్చి ఉంటుంది. ఇక ఇదే విషయంపై తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ప్రియమణి లోకానికి తెలియని సంచలన నిజాలను బయటపెట్టింది.

ఓ పాడ్ కాస్ట్ లో ప్రియమణి సెలబ్రిటీల పబ్లిసిటీపై మాట్లాడుతూ..”ఈ విషయం ఇంతవరకు బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. ఇది ఎక్కువగా ముంబైలో జరుగుతుంది. సెలబ్రిటీలు జిమ్ము, ఎయిర్ పోర్ట్ ల్లో కనిపించగానే ఫొటోగ్రాఫర్లు ఎలా వస్తారని మీరు అనుకుంటారు? ఓపెన్ గా చెప్తున్నా.. వారిని ముందుగానే అరెంజ్ చేస్తారు. ఎంత మంది కావాలి? ఏ టైమ్ కు ఎక్కడికి అంటే.. జిమ్, ఎయిర్ పోర్ట్ ఇలా ప్లేస్ లు ఫిక్స్ అయ్యాక వారు ఆ టైమ్ కు అక్కడికి వస్తారు. ఇక వారిని అరేంజ్ చేసే పాప్రాజీ అనే వ్యక్తి పని అయిపోయిన తర్వాత వారికి డబ్బులు ఇస్తాడు” అంటూ కళ్లు బైర్లుకమ్మే నిజాలను చెప్పుకొచ్చింది ప్రియమణి. ఇక ఆమె చెప్పిన నిజం తెలిసి.. ముక్కునవేలేసుకుంటున్నారు జనాలు. అంటే ఇన్ని రోజులు మనం వాళ్లు చిన్నా చితక టీవీ, యూట్యూబ్ ఛానల్స్ వాళ్లు కాదా? పెయిడ్ ఫొటోగ్రాఫర్లా? మమ్మల్ని ఇంత మోసం చేస్తారా? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వాసంతి- పవన్ కల్యాణ్ పై ట్రోల్స్.. ఇంటర్వ్యూలో ఇలా చేస్తారా అంటూ..

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişBettilt girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel