iDreamPost
android-app
ios-app

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్‌

  • Published Sep 05, 2024 | 1:30 PM Updated Updated Sep 05, 2024 | 1:30 PM

Actress Pranitha Subhash: కన్నడ ఇండస్ట్రీలో పోర్కీ మూవీతో ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న నటి ప్రణిత తర్వాత తెలుగు‌లో వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తాజాగా ప్రణీత సుభాష్ తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

Actress Pranitha Subhash: కన్నడ ఇండస్ట్రీలో పోర్కీ మూవీతో ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న నటి ప్రణిత తర్వాత తెలుగు‌లో వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తాజాగా ప్రణీత సుభాష్ తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

  • Published Sep 05, 2024 | 1:30 PMUpdated Sep 05, 2024 | 1:30 PM
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్‌

ఇటీవల టాలీవుడ్‌లోకి ఎంతోమంది కన్నడ బ్యూటీలు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్లుగా మారుతున్నారు. ‘ఏం పిల్లో ఏం పిల్లడో ’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణిీత వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ అచ్చ తెలుగు అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు కన్నడ,తెలుగు,తమిళ భాషల్లో నటించింది.  ఇటీవల  వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా పలు రియాల్టీ షోస్ కి జడ్జీగా వ్యవహరిస్తూ ఇక్కడ కూడా తన సత్తా చాటుకుంది. హీరోయిన్ గా మంచి ఫామ్‌లో ఉండగానే బిజినెస్ మ్యాన్  పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఒక పాప ఉంది. ఇటీవల తాను ప్రెగ్నెన్నీ అంటూ ఫోటో షేర్ చేసింది. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో ‘ఏం పిల్లో ఏం పిల్లడో ’ హీరోయిన్ గా పరిచయం అయిన ప్రణితా సుభాస్ ‘అత్తారింటికి దారేది’ మూవీతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వినాయకచవితి పండుగ శుభ సందర్భంగా నటి ప్రణిత సుభాష్ అభిమానులకు చెప్పింది. గురువారం (సెప్టెంబర్ 5) న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఈ సందర్భంగా ప్రణీత స్పందిస్తూ.. ‘ మా కుటుంబం అంతా ఎంతో థ్రిల్ గా ఉన్నాం.. నా కూతురు ఆర్నా.. బాబుని ‘బేబీ’ అని పిలుస్తుంది.. తనకు తమ్ముడు తోడుగా వచ్చాడని ఇంకా గ్రహించలేకపోతుంది అనుకుంటా’ అని ఇన్ స్ట్రా వేదికగా తెలిపింది.

2021 లో ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లి చేసుకుంది ప్రణీత. జూన్ 2022లో ఈ జటంటకు కుమార్తె జన్మించింది. పాప పుట్టిన తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. కాకపోతే బుల్లితెరపై రియాల్టీ షోలో మెరుస్తుంది. తెలుగు‌లో వస్తున్న డీ డ్యాన్స్ షోలో కొన్ని ఎపిసోడ్స్ కి ప్రణీత జడ్జీగా వ్యవహరించింది. ఇప్పుడు ఆమె స్థానంలోకి హన్సిక ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, అత్తారింటికి దారేది, బావ, హలో గురు ప్రేమ కోసమే, రభస, డైనమైట్, పాండవులు పాండవులు తుమ్మెద తదితర చిత్రాల్లో నటించింది. బంధు,మిత్రులు, సినీ పరిశ్రకు చెందిన ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల ప్రణితా సుభాష్ బేబీ పంప్ తో ఇన్ స్ట్రాలో తన ఫ్యాన్స్ కి ఫోటోలు షేర్ చేసిన విషయం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Pranita Subhash (@pranitha.insta)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş