iDreamPost
android-app
ios-app

ఆ డైరెక్టర్ ఓ అమ్మాయిని గర్భవతిని చేశాడు.. నటి పూనమ్ కౌర్ సంచలన పోస్టు

  • Published Oct 09, 2024 | 4:56 PM Updated Updated Oct 09, 2024 | 4:56 PM

Poonam kaur: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టు చేసింది. ఓ డైరెక్టర్ ఓ అమ్మాయిని సినీ అవకాశాల పేరుతో గర్భవతిని చేశాడంటూ సంచలన కామెంట్స్ చేసింది.

Poonam kaur: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టు చేసింది. ఓ డైరెక్టర్ ఓ అమ్మాయిని సినీ అవకాశాల పేరుతో గర్భవతిని చేశాడంటూ సంచలన కామెంట్స్ చేసింది.

  • Published Oct 09, 2024 | 4:56 PMUpdated Oct 09, 2024 | 4:56 PM
ఆ డైరెక్టర్ ఓ అమ్మాయిని గర్భవతిని చేశాడు.. నటి పూనమ్ కౌర్ సంచలన పోస్టు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు అలజడి సృష్టిస్తున్నాయి. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన సంచలనంగా మారుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. తనపై లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారానికి ఒడిగట్టాడని జానీ వద్ద వర్క్ చేసిన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు. ఆ కేసు విచారణ కోర్టులో సాగుతోంది. ఇది జరిగిన కొన్ని రోజులకే ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్యూయెన్సర్ హర్షసాయిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, డబ్బులు తీసుకుని మోసం చేశాడని కంప్లైంట్ చేసింది.

ఇదిలా ఉంటే ఓ ఫోక్ సింగర్ పై తన వద్ద పనిచేసిన యువతి తనను అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఇలా ఒక్కొక్క ఘటన సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఘటన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టు చేసింది. ఇండస్ట్రీలోని ఓ దర్శకుడు అవకాశాల పేరుతో అమ్మాయిని మోసం చేశాడని తెలిపింది. సినీ అవకాశాలు ఇస్తానని నమ్మించి గర్భవతిని చేశాడంటూ సంచలన కామెంట్స్ చేసింది. పూనం చేసిన పోస్టు ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. నటి పూనం కౌర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడుకి ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉంటారు.

పూనమ్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహిళలపై జరిగే అన్యాయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడిస్తుంది. సినీ దర్శకులు, హీరోలపై విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతూ ఉంటుంది. వారి చెడు స్వభావాలు తనకు తెలుసు అంటూ సోషల్ మీడియా ద్వారా తన వాయిస్ ను వినిపిస్తూ ఉంటుంది నటి పూనమ్. ఓ దర్శకుడు ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడంటూ అప్పట్లో సంచలన కామెంట్స్ చేసింది. ఇప్పుడు మరోసారి ఓ దర్శకుడు ఓ అమ్మాయిని గర్భవతిని చేశాడంటూ సంచలన పోస్టు చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ ఓ పంజాబీ అమ్మాయిని గర్భవతిని చేశాడని ఎక్స్ లో పోస్ట్ చేసింది.

ఆమె కెరియర్ ను నాశనం చేశాడంటూ పేర్కోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ జోక్యంతో ఆ పంజాబీ బ్యూటీ కి కాస్త సహాయం లభించిందని వెల్లడించింది. అతడు లీడర్ గా మారినా నటుడు కాదు. అత‌డు ద‌ర్శ‌కుడు. అయితే ఈ విషయంలోకి తనను, ఓ నటుడు, రాజకీయ నాయకుడిని అనవసరంగా లాగారు అంటూ పూనం రాసుకోచ్చింది. కాగా పూనమ్ వారి పేర్లు ప్రస్తావించకపోవడంతో ఆమె వ్యాఖ్య‌లు ఎవ‌రిపై అంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. మరి నటి పూనమ్ కౌర్ ఓ దర్శకుడు పంజాబీ అమ్మాయిని గర్భవతిని చేశాడంటూ చేసిన పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş