iDreamPost
android-app
ios-app

ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్

  • Published Nov 30, 2023 | 4:56 PM Updated Updated Nov 30, 2023 | 4:56 PM

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య సినీ నటులు వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే.

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య సినీ నటులు వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే.

  • Published Nov 30, 2023 | 4:56 PMUpdated Nov 30, 2023 | 4:56 PM
ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో వరుసగా నటీనటులు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వివాహబంధంతో ఒక్కటవుతున్నారు. చాలా వరకు ఇండస్ట్రీలో నటీనటులు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కన్నడ నాట క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ ‘దండుపాళ్యం’. రియల్ స్టోరీ బేస్ చేసుకొని తెరెక్కించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో కూడా మంచి విజయం అందుకుంది. ఈ మూవీలో నటించిన హీరోయిన్ తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

2012 శ్రీనివాస్ రాజు డైరెక్షన్ లో రిలీజ్ అయిన ‘దండుపాళ్యం’ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీలో పూజా గాంధీ, రఘు ముఖర్జీ ముఖ్య భూమిక పోషించారు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ మూవీ అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టిందని ఇండస్ట్రీ టాక్. దండుపాళ్యం అనే నేరగాళ్లకు సంబంధించిన ఈ మూవీ అదే పేరుతో తెరకెక్కించారు. ఈ మూవీలో నటి పూజా గాంధీ ఎంతో నేచురల్ గా నటించి మెప్పించింది. కొంత కాలంగా ఓ లాజిస్టిక్స్ కంపెనీ అధినేత విజయ్ తో ప్రేమలో ఉంది. ఇటీవల పూజాగాంధ ప్రేమించిన వ్యక్తితో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

పూజా గాంధీ తాను ప్రేమించిన వ్యక్తి విజయ్ తో వైవాహి జీవితంతోకి అడుగు పెట్టింది. లేటు ఏళ్ల వయసులో ఓ ఇంటి కోడలిగా వెళ్లింది. బుధవారం నాడు బెంగుళూరులో వీరి వివాహం జరిగింది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా వీరి పెళ్లి వేడుక జరిగినట్లు తెలుస్తుంది. ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రెటీలు, సన్నిహితులు, బంధువులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పూజా గాంధీ తెలుగు, కన్నడ, హిందీ, బెంగాళీ, తమిళ భాషల్లో నటించింది. తెలుగు లో దండుపాళ్యం సీరీస్ తో బాగా పాపులర్ అయ్యింది. గతంలో తనకు నిశ్చితార్థం అయినప్పటికీ దాదాపు 11 ఏళ్ల తర్వాత విజయ్ ని పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది పూజా గాంధీ.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet