iDreamPost
android-app
ios-app

Salaar Movie: నటి సంచలన వ్యాఖ్యలు.. సలార్ ఓ చెత్త సినిమా అంటూ

  • Published Dec 25, 2023 | 8:13 AM Updated Updated Dec 25, 2023 | 8:15 AM

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన డైనోసార్ సలార్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సలార్ సినిమాపై అభిమానులు, సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తుండగా.. ఓ నటి మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన డైనోసార్ సలార్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సలార్ సినిమాపై అభిమానులు, సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తుండగా.. ఓ నటి మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

  • Published Dec 25, 2023 | 8:13 AMUpdated Dec 25, 2023 | 8:15 AM
Salaar Movie: నటి సంచలన వ్యాఖ్యలు.. సలార్ ఓ చెత్త సినిమా అంటూ

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి చిత్రాల తర్వాత సరైన హిట్ లేక దాదాపు 6 సంవత్సరాలు అవుతోంది. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి చిత్రాలు ప్రభాస్ క్రేజ్ కు తగ్గ విజయాలు సాధించలేకపోయాయి. రెబల్ స్టార్ నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు.. ప్రశాంత్ నీల్ ప్రకటన భారీ ఊరట కలిగించింది. ఇద్దరు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉన్న వాళ్లే. ఇక కేజీఎఫ్ పార్ట్ 1, 2లతో ప్రశాంత్ నీల్ టాలెంట్ ఏంటో ఇండియా వైడ్ గా తెలిసింది. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన సలార్ సినిమా మీద దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ ఎలాంటి ప్రమోషన్లు లేకుండా సలార్ మూవీని డిసెంబర్ 22న విడుదల చేశాడు. థియేటర్లలో సలార్.. మోత మోగిస్తున్నాడు. ప్రభాస్ తో పోటీ పడి.. రెబల్ స్టార్ సినిమాను తొక్కేద్దామనుకున్న షారుక్ ఖాన్.. బాక్సాఫీస్ వద్ద వెనకబడ్డాడు.

సలార్ సినిమా చూసిన అభిమానులు.. ప్రశాంత్ నీల్ తమ ఆరేళ్ల ఆకలిని తీర్చాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ మాస్ యాక్షన్, నీల్ ఎలివేషన్స్ ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకున్నాయి. సలార్ మూవీపై సెలబ్రిటీలు సైతం ప్రశంసలుకురిపిస్తుండగా.. ఓ నటి మాత్రం చెత్త సినిమా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ట్రోలింగ్ బారిన పడింది. ఇంతకు ఆ నటి ఎవరంటే.. సంచలనాలకు కెరాఫ్ అడ్రెస్ గా గుర్తింపు తెచ్చుకున్న పాయల్ ఘోష్. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. స్టార్‌ హీరోలు, హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. అలాగే పాయల్‌ షేర్‌ చేసే సోషల్‌ మీడియా పోస్టులు కూడా తెగ వైరలవుతుంటాయి.  ఈ క్రమంలో తాజాగా మరోసారి  సంలచన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది పాయల్.

payal ghosg comments on salar movie

ఇటీవల రిలీజైన ప్రభాస్‌ సలార్‌, షారుఖ్‌ ఖాన్‌ డంకీ సినిమాలను ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. ‘2023లో విడుదలైన సినిమాలన్నీ చెత్తగా ఉన్నాయి. ఒక్కటీ కూడా బాగలేదు. డంకీ, సలార్ సినిమాలు కూడా చెత్తగా ఉన్నాయి. తన కెరీర్‌లో మొదటిసారి రాజ్ కుమార్ హిరానీ డంకీ వంటి ఫ్లాప్ సినిమా తీశాడు. డంకీ, సలార్ రెండు చెత్త సినిమాలే. అయితే సలార్ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తాయి. ఎందుకంటే ప్రభాస్‌ యంగ్ అండ్ పవర్‌ఫుల్‌ పర్సన్. తనకు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది’ అని వరుసగా ట్వీట్లు చేసింది పాయల్ ఘోష్‌.

వీటితో పాటు ఈ ఏడాది బాలీవుడ్‌లో భారీ కలెక్షన్లు సాధించిన పఠాన్‌, జవాన్‌, యానిమల్‌ సినిమాలపై కూడా విమర్శుల చేసింది పాయల్‌ ఘోష్‌. ‘పఠాన్‌, జవాన్‌, యానిమల్‌ సినిమాలు కూడా అంతగా ఏం బాగోలేవు. అన్నీ చిత్రాలు జనాలను పిచ్చోళ్లను చేసేలా ఉన్నాయి’ అని ట్వీట్ చేసింది పాయల్ ఘోష్‌. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఈ బ్యూటీ ట్వీట్స్‌కు ఎవరూ కూడా పెద్దగా స్పందించడం లేదు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవు.. అందుకే ఏదో విధంగా వార్తల్లో నిలిచి ఫేమస్‌ అయ్యేందుకే ఇలాంటి పనికిమాలిన కామెంట్స్‌ చేస్తుందంటూ  నెటిజన్లు విమర్శిస్తున్నారు.

మంచు మనోజ్‌ ‘ప్రయాణం’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది కోల్‌కతా బ్యూటీ పాయల్‌ ఘోష్‌. ఆ తర్వాత ఊసర వెల్లితో పాటు మరి కొన్ని సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాక కొన్ని హిందీ, పంజాబీ సినిమాల్లోనూ మెరిసింది. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది పాయల్‌. అదే సమయంలో అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. 2020లో రామ్‌దాస్‌ అథవాలే స్థాపించిన రాజకీయ పార్టీలో చేరింది పాయల్‌ ఘోష్‌. అంతేకాదు మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా ఎంపికైంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş