iDreamPost
android-app
ios-app

ప్రియుడితో ప్రముఖ నటి పావని రెడ్డి బ్రేకప్‌!

  • Published Aug 11, 2023 | 10:38 AM Updated Updated Aug 11, 2023 | 10:38 AM
  • Published Aug 11, 2023 | 10:38 AMUpdated Aug 11, 2023 | 10:38 AM
ప్రియుడితో ప్రముఖ నటి పావని రెడ్డి బ్రేకప్‌!

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు పావని రెడ్డి. సీరియల్‌, సినిమా నటిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. తమిళ నాట కూడా ఆమె చాలా ఫేమస్‌. పావని తెలుగు,తమిళం, మలయాళ భాషల్లో పలు సీరియళ్లు, సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆమె తమిళ సీరియల్స్‌తో బీజీ అయిపోయారు. తన అందం, అభినయంతో సౌత్‌ ఇండియా వ్యాప్తంగా పావని అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. సినిమాలు, సీరియల్‌ షూటింగ్‌లతో ఎంత బిజీబిజీగా ఉన్నా సోషల్‌ మీడియాలో చాలా యా​క్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఉంటారు.

తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అభిమానులతో ‘ఆస్క్‌ మీ ఏ క్వశ్చన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెను పలు ప్రశ్నలు వేశారు. కొంతమంది ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు కూడా వేశారు. ఓ అభిమాని ‘మీరు అమీర్‌ ప్రేమించుకుంటున్నారా?’ అన్న ప్రశ్నకు ‘‘ అవునా?’’అని సమాధానం ఇచ్చారు. ‘‘ మీరు సింగిలా?’ అని అడిగిన ప్రశ్నకు ‘మ్మ్‌’ అని సమాధానం ఇచ్చారు. ‘ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు’.. ‘ రేపే.. మీరు కూడా రావాలనుకుంటున్నారా?’అంటూ వ్యంగ్యంగా స్పందించారు. అభిమానులు ఆమె ఇచ్చిన ఈ సమాధానాలతో ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Actress pavani breakup with his boyfriend

అమిర్‌, పావని రెడ్డిలు బ్రేకప్‌ చెప్పుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరి, ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే పావని నుంచి గానీ, అమీర్‌నుంచి గానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, 2016లో తెలుగు నటుడు ప్రదీప్‌ కుమార్‌తో పావని ప్రేమలో పడ్డారు. ఇద్దరూ 2017, ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజున పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరి కాపురం ఎక్కువ కాలం సజావుగా సాగలేదు. అనుకోని విధంగా ప్రదీప్‌ 2017 మే 17న హైదరాబాద్‌లోని తన నివాసంలో సూసైడ్‌ చేసుకున్నారు. భర్త మరణం తర్వాత పావని తమిళ సీరియళ్లు, సినిమాలపై ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. ఈ టైంలోనే తమిళ కొరియోగ్రాఫర్‌ అమీర్‌ ఏడీఎస్‌తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş