iDreamPost
android-app
ios-app

యంగ్ పొలిటిషియన్ తో స్టార్ హీరోయిన్ పెళ్లి! డేట్ కూడా లాక్ అయ్యిందట!

  • Author ajaykrishna Published - 04:01 PM, Mon - 21 August 23
  • Author ajaykrishna Published - 04:01 PM, Mon - 21 August 23
యంగ్ పొలిటిషియన్ తో స్టార్ హీరోయిన్ పెళ్లి! డేట్ కూడా లాక్ అయ్యిందట!

రోజులు గడుస్తున్నకొద్దీ ఇండస్ట్రీలో ఒక్కో బ్యూటీ లవ్, అరేంజ్ అంటూ వివాహ బంధంలో అడుగు పెడుతున్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు తమ కోస్టార్స్ ని పెళ్లి చేసుకుంటుంటే.. ఇంకొందరు బిజినెస్ మ్యాన్, పొలిటిషియన్ లను పెళ్లాడుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ కి చెందిన ఓ హీరోయిన్ ఇదే కోవలో చేరబోతుంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్ పరిణితి చోప్రా గురించి వినే ఉంటారు. హీరోయిన్ గా ప్రియాంక రేంజ్ లో కాకపోయినా.. తన కెరీర్ వరకు సాటిస్ఫైడ్ సినిమాలు చేసింది. అయితే.. ఈ భామ ఓవైపు సినిమాలు చేస్తూనే.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన యంగ్ పొలిటిషియన్ ని లవ్ చేసింది.

కట్ చేస్తే.. ఈ ఏడాది మే నెలలో ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అలాగే రాబోవు సెప్టెంబర్ లో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. పరిణితి చోప్రా.. ఢిల్లీకి చెందిన పొలిటిషియన్ రాఘవ్ చద్దా.. ఇద్దరు ఒకరినొకరు కొన్నాళ్ళుగా డేటింగ్ చేసి.. ప్రేమించుకున్నారు. అయితే.. వీరి పెళ్లి సెప్టెంబర్ 25న జరుపుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. అయితే.. ఈ పెళ్లి ప్రియాంక చోప్రా లాగా డెస్టినేషన్ వెడ్డింగ్ మాదిరి జరుగుతుందా లేక.. వేరే ఎక్కడైనా ప్లాన్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా.. ప్రస్తుతం పరిణితి – రాఘవ్ ల పెళ్లికి ఏర్పాట్లు మొదలయ్యాయని టాక్.

ఇదిలా ఉండగా.. ఎలాగో ఇద్దరు సెలబ్రిటీస్ కాబట్టి పెళ్లి గ్రాండ్ గానే జరుగుతుంది. అయితే.. తన పెళ్లి విషయమై ఇంకా పరిణితి మాత్రం నోరు విప్పలేదు. ఇద్దరు వారి వారి కుటుంబ సభ్యులతో పాటు అతిథుల జాబితా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ మొదటి వారంలో పరిణితి తన పెళ్లి సన్నాహాలలో పాల్గొనబోతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక పరిణితి, రాఘవ్ ల పెళ్లి రాజస్థాన్ లో.. రిసెప్షన్ వచ్చేసి గురుగ్రామ్ లో నిర్వహించనున్నారని టాక్ నడుస్తోంది. జోద్ పూర్ లోని ఉమైద్ భవన్ ను వివాహ వేదికగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం పరిణితి – రాఘవ్ ల జంటకు ఫ్యాన్స్, నెటిజన్స్ సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. మరి ఈ హీరోయిన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoon girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş