iDreamPost
android-app
ios-app

ఆ హీరోకి లిప్ కిస్ ఇచ్చాక డెటాల్ తో నోరు కడుక్కున్నాను: లస్ట్ స్టోరీస్ 2 నటి

  • Author Soma Sekhar Published - 07:26 PM, Wed - 28 June 23
  • Author Soma Sekhar Published - 07:26 PM, Wed - 28 June 23
ఆ హీరోకి లిప్ కిస్ ఇచ్చాక డెటాల్ తో నోరు కడుక్కున్నాను: లస్ట్ స్టోరీస్ 2 నటి

సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీ, నటులు అన్ని రకాల క్యారెక్టర్లు చేయాల్సి వస్తుంది. అయితే కొంత మంది హీరోయిన్లు స్టార్టింగ్ లో రొమాంటిక్ పాత్రలకు, ముద్దులు పెట్టేందుకు సిద్దపడి ఉండరు. దాంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. తాజాగా లస్ట్ స్టోరీస్ 2 నటి కూడా తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆందోళన పడ్డ సీన్ల గురించి చెప్పుకొచ్చింది. ఓ హీరోకి ముద్దు ఇచ్చిన తర్వాత.. డెటాల్ తో నోరు కడుక్కున్నాను అంటూ సంచలన విషయాలు వెల్లడించింది. ఇక ఈ బ్యూటీ కొన్ని రోజుల క్రితం యువతను ఉద్దేశించి బోల్డ్ కామెంట్స్ చేసి.. హాట్ టాపిక్ గా నిలిచింది. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది లస్ట్ స్టోరీస్ 2 నటి.

లస్ట్ స్టోరీస్ 2.. ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న ట్రైలర్. 2018లో వచ్చిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ కు ఇది సీక్వెల్ గా వస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. శృంగారానికి సంబంధించిన విషయాలను ఓపెన్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇక లస్ట్ స్టోరీస్ 2లో నటించిన ఓ నటి తన తొలి ముద్దు అనుభవాల్ని పంచుకుంది. ఆమె చెప్పిన విషయాలు విని అందరు షాక్ కు తప్పక గురై ఉంటారు. బాలీవుడ్ నటి నీనా గుప్తా బోల్డ్ కామెంట్స్ చేస్తూ.. తెగ పాపులర్ అవుతోంది. మెున్న యువతను ఉద్దేశించి బోల్డ్ కామెంట్స్ చేయగా.. తాజాగా తాన తొలి ముద్దు విషయాలను షేర్ చేసుకుంది.

చాలా సంవత్సరాల క్రితం బాలీవుడ్ నటుడు దిలీప్ ధావన్ తో కలిసి ఓ టీవీ సీరియల్ లో నటించింది నీనా గుప్తా. ఆ సీరియల్ లో దిలీప్ ధావన్ తో ఓ ముద్దు సీన్లో నటించింది నీనా గుప్తా. అయితే ఈ ముద్దు సీన్ అనంతరం తన నోరును డెటాల్ తో కడుక్కున్నాను అంటూ సంచలన విషయాలు వెల్లడించింది. ఇక ముద్దు సీన్లో నటించిన రాత్రి నాకు నిద్రపట్టలేదని తెలిపింది. ముద్దు సీన్ చేసే సమయానికి నేను దానికి సిద్దంగా లేను. కానీ షూటింగ్ కాబట్టి తప్పక చెయ్యాల్సి వచ్చినట్లు నీనా గుప్తా తెలిపింది. తెలియని వ్యక్తికి ముద్దు పెట్టడం చాలా కష్టం అని చెప్పుకొచ్చింది ఈ ఓల్డ్ బోల్డ్ బ్యూటీ.

కాగా లస్ట్ స్టోరీస్ 2 జూన్ 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాత్రకు బామ్మగా నీనా గుప్తా నటించింది. “పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ కు వెళ్లండి” అన్న డైలాగ్ చెప్పి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది నీనా గుప్తా. ఇక ముద్దు పెట్టాక డెటాల్ తో నోరు కడుక్కున్నాను అన్న విషయం తెలిస్తే.. ఆ నటుడు ఎంత ఫీల్ అవుతాడో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ