iDreamPost
android-app
ios-app

ఇప్పటికైనా పెళ్లి చేసుకొని, పిల్లల్ని కనాలని ఉంది: నగ్మ

  • Author ajaykrishna Updated - 04:27 PM, Wed - 30 August 23
  • Author ajaykrishna Updated - 04:27 PM, Wed - 30 August 23
ఇప్పటికైనా పెళ్లి చేసుకొని, పిల్లల్ని కనాలని ఉంది: నగ్మ

ఈ మధ్యకాలంలో పెళ్లి అనేది ఒక ఏజ్ కి రాగానే చేసుకోవాలి.. అనే మాట మీద జరగట్లేవు అని చెప్పాలి. ఇదివరకు అమ్మాయిలకు 18.. అబ్బాయిలకు 20 ఏళ్లు దాటితే పెళ్ళెప్పుడు అనేవారు. అక్కడినుండి మెల్లగా అమ్మాయిలకు 22, అబ్బాయిలకు 25 వరకు వచ్చాక అడగడం మొదలు పెట్టారు. కానీ.. ఇప్పుడు ఇద్దరికి ముప్పై ఏళ్లు దాటినా పెళ్ళెప్పుడు అని అడిగితే చేసుకునేందుకు సిద్ధంగా లేమని అంటున్నారు. అసలు పెళ్లెందుకు అనుకునే బ్యాచ్ కూడా ఈ మధ్య తయారవుతోంది. అయితే.. సెలబ్రిటీల విషయానికి వస్తే.. ఇప్పుడే పెళ్లేంటి అని కొందరు.. ఎలాంటి చడీచప్పుడు లేకుండా చేసుకునేవారు ఇంకొందరు. కానీ.. కొంతమంది మాత్రం లేటు వయసులో పెళ్లి కావాలని అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు తాజాగా అలాంటి జాబితాలో చేరింది సీనియర్ నటి నగ్మా. హీరోయిన్ గా నగ్మా గురించి తెలుగు మాత్రమే కాదు.. ఇండియా వైడ్ పరిచయం అక్కర్లేదు. గ్లామర్ బ్యూటీగా ఒకప్పుడు ఇండస్ట్రీని తన అందచందాలతో ఊపేసింది. అప్పట్లో నగ్మా ఫామ్ అలా ఉండేది. ఏడాదికి సుమారు ఐదు సినిమాలకు పైగా చేస్తుండేది. అలాగని ఒక్క భాషలో కాదుగా.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, భోజ్ పురి, పంజాబీ, బెంగాలీ ఇలా ఎక్కడ అవకాశం వస్తే అక్కడికెళ్లి సినిమాలు చేసింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొద్దీ కాలానికే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. కానీ.. హీరోయిన్ దాదాపు పదేళ్లకు పైగా రాణించిన ఈ భామ.. 2008లో నటనకు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ లో చేరింది.

కట్ చేస్తే.. నగ్మా ఇప్పటికి పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. తెలుగు తెరకు దూరమై దాదాపు ఇరవై ఏళ్లు అవుతోంది. అయితే.. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు తోటి హీరోలతో లవ్ ట్రాక్స్ నడిపిందని నగ్మ గురించి టాక్ ఉంది. ప్రస్తుతం నగ్మ వయసు 48 ఏళ్లు. కాగా.. ఇటీవల పెళ్లి గురించి తన అభిప్రాయం బయటపెట్టింది. నగ్మ మాట్లాడుతూ.. “పెళ్లి చేసుకోకూడదు అనే ఆలోచన నాకు లేదు. నాకంటూ ఓ తోడు ఉండాలని, పిల్లలను కనాలని ఆశగా ఉంది. పెళ్లితో ఓ ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవచ్చని ఉంది. కాలం కలిసి వస్తే.. త్వరలో పెళ్లి చేసుకుంటానేమో. ఒకవేళ అనుకున్నట్లే పెళ్లి అయితే చాలా హ్యాపీ.” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నగ్మ ఇప్పటికైనా పెళ్లి చేసుకునేందుకు రెడీగానే ఉందంటూ కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి నగ్మ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss