iDreamPost
android-app
ios-app

దావూద్ ఇబ్రహీంని ప్రేమించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

  • Published Dec 20, 2023 | 4:57 PM Updated Updated Dec 20, 2023 | 4:57 PM

సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చి..తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే కొన్ని కొన్ని సంఘటన కారణంగా అకస్మాత్తుగా వెండితెరకు దూరమవుతుంటారు. అలాంటి నటీమణులు ఎందరో ఉన్నారు.

సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చి..తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే కొన్ని కొన్ని సంఘటన కారణంగా అకస్మాత్తుగా వెండితెరకు దూరమవుతుంటారు. అలాంటి నటీమణులు ఎందరో ఉన్నారు.

  • Published Dec 20, 2023 | 4:57 PMUpdated Dec 20, 2023 | 4:57 PM
దావూద్ ఇబ్రహీంని ప్రేమించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో  ఇప్పటికి మొదటిగా వినిపించే పేరు దావుద్ ఇబ్రహీం. తాజాగా, దావుద్ ఇబ్రహీం పేరు మరోసారి వార్తల్లో నిలుస్తుంది. అతని ఆరోగ్యం క్షీణించిందంటూ.. దావుద్ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడనే.. కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి దావుద్ పైనే ఉంది. ఈ క్రమంలో దావుద్ ప్రేమించిన అమ్మాయి గురించి కొన్ని ఆసక్తి కథనాలు  బయటపడుతున్నాయి. 80,90 వ దశకంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ బ్యూటీ .. క్రిమినల్ తో ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత ఆ నటి జీవితంలో ఏం జరిగింది అనే చర్చ మొదలయ్యింది.

ఆమె మరెవరో కాదు, బాలీవుడ్ లో రామ్ తేరీ గంగా మైలీ అనే చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన ‘మందాకినీ’. తెలుగులోను  ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘సింహాసనం’ చిత్రంలో.. ‘ఆకాశంలో ఒక తార..’ అనే పాటలో నటించి అందరిని ఆకట్టుకుంది. అలాగే ,నందమూరి బాలక్రిష్ణ హీరోగా నటించిన భార్గవరాముడు అనే సినిమాలో మందాకిని హీరోయిన్ గా నటించింది.  ఆమె అప్పటికే బాలీవుడ్ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

26 ఏళ్ల క్రితం మందాకినిని గుర్తించిన రాజ్ కపూర్.. ఆమెను  బాలీవుడ్ కు పరిచయం చేయాలని..  రామ్ తేరీ గంగా మైలీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఇక ఈ చిత్రంతో మందాకినీ స్థాయి మారిపోయింది.  ఆ తర్వాత ఆమెతో సినిమాలు తీయాలని.. ఎంతో మంది బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు క్యూలు కట్టి ఆమె  ఇంటి ముందు మకాం వేశారు.  అయితే,  ఆ తర్వాత మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. దానికి కారణం మందాకిని.. మాఫియా డాన్ దావూద్‌ ఇబ్రహీంతో  కలిసి ఉన్న ఫోటో వైరల్‌గా మారడమే. దీనితో బాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయ్యింది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా వార్తలు వచ్చాయి.

దావుద్ ఇబ్రహీం ముంబై లోని బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రధారి. అలాగే అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని  తన కంట్రోల్ లో ఉంచుకునే వాడు. ఇండస్ట్రీలోని ఎంతో మంది టాప్ హీరోయిన్స్ తో అతను ప్రేమ వ్యవహారాలు సాగించాడు. వారిలో ఒకరు మందాకినీ. ఆమె  అందానికి దావుద్ పిచ్చెక్కిపోయేవాడు. అలానే, మందాకినీ కూడా అతనితో కలిసి తిరిగేది. ఆ క్రమంలో వారిద్దరూ 1994లో దుబాయిలోని  ఓ  క్రికెట్ స్టేడియంలో.. వీరిద్దరూ కలిసి  పక్క పక్కనే కూర్చున్న ఫోటో ఒకటి బయటకు  వచ్చింది. దీనితో మందాకినీ, దావుద్ ప్రేమ వ్యవహారం సంచలనం సృష్టించింది. మందాకినీ కూడా దావుద్ నేర కార్యకలాపాలలో భాగస్తురాలనే వదంతులు వినిపించాయి. ఆ ఒక్క ఫోటో కారణంగా బాలీవుడ్ లో అగ్ర నటిగా ఉన్న మందాకినీ..  సినీ పరిశ్రమకు పూర్తిగా దూరం అయింది.

ఆ తర్వాత 1990లో ప్రముఖ వైద్యుడు కాగ్యుర్ రిపోంచే ఠాకూర్ ని వివాహం చేసుకుంది. ఆమెకి ఇనాయ, రబిల్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, ఆమె కుటుంబంతో కలిసి దుబాయ్ లో సెటిల్ అయింది. ఇక  దావుద్ విషయానికొస్తే ప్రస్తుతం అతను కరాచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతను ఉన్న  ఆసుపత్రికి భారీగా పోలీసుల భద్రత కల్పించినట్లు సమాచారం. అలాగే, దావూద్ ఇబ్రహీం చికిత్స పొందుతున్న  ఫ్లోర్‌లో ఇతర రోగులను ఉంచలేదు. కేవలం ఆ ఫ్లోర్‌లో  దావూద్‌కు మాత్రమే చికిత్స  అందిస్తున్నారు. మరి ఒక  అండర్ వరల్డ్ డాన్ తో ప్రేమలో పడి, తన కెరీర్ ను నాశనం చేసుకున్న, నటి మందాకినీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss