iDreamPost
android-app
ios-app

ఈ లాయర్ ఇప్పుడు హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

  • Published Apr 30, 2024 | 4:05 PM Updated Updated Apr 30, 2024 | 4:05 PM

Actress Malavika Sharma: సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో, హీరోయిన్లుగా చెలామణి అవుతున్నవారు.. వ్యక్తిగత జీవితంలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా కొనసాగుతున్నారు.

Actress Malavika Sharma: సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో, హీరోయిన్లుగా చెలామణి అవుతున్నవారు.. వ్యక్తిగత జీవితంలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా కొనసాగుతున్నారు.

  • Published Apr 30, 2024 | 4:05 PMUpdated Apr 30, 2024 | 4:05 PM
ఈ లాయర్ ఇప్పుడు హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఉన్నతమైన చదువులు చదివి నటనపై ఆసక్తితో నటులుగా మారిన విషయం తెలిసిందే. చాలా మంది హీరోయిన్లు ఇతర ఫీల్డ్స్ లో ఉంటూ నటీమణులుగా రాణిస్తున్నారు. కొంతమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే తాము కోరుకు్న కలల వైపు అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ లో సాయి పల్లవి, శ్రీలీల ఓ వైపు ఎంబీబీఎస్ చదువుతూనే హీరోయిన్లుగా టాప్ పొజీషన్లో కొనసాగుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఓ వైపు ఎల్ ఎల్ బీ చదువతూనే మరోవైపు పలు సినిమాల్లో బిజీగా ఉంటుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అనుకుంటున్నారా? పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబైకి చెందిన మాళవిక శర్మ.. లా చదువుతున్న సమయంలో నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ లో రాణిస్తున్న సమయంలో చిన్న చిన్న యాడ్స్ చేసింది. ముంబైలోని రిజ్వీ లా కాలేజ్ లో చదివిన మాళవిక.. క్రిమినాలజీ స్పెషలైజేషన్ బ్రాంచ్ లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది. లా చేస్తూన్న సమయంలో రవితేజ నటించిన ‘నేల టికెట్’ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. అలా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముంబై బ్యూటీ తర్వాత రెడ్, కాఫి విత్ కాదల్ మూవీలో నటించింది. తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇటీవల గోపీ చంద్ నటించిన భీమా మూవలో నటించింది.

ప్రస్తుతం సుధీర్ బాబు సరసన హరోంహర సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే లాయర్ గా ఉన్నత చదువులు చదువుతుంది. తాజాగా మాళవిక శర్మ తన సోషల్ మాధ్యమంలో అడ్వకేట్.. ఎల్‌ఎల్‌ఎం స్టూడెంట్ అంటూ క్యాప్షన్ ఇస్తూ లాయర్ గా దిగిన ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ అందాల భామ క్రిమినల్స్ కి చెక్ పెట్టే లాయరా? అంటూ అశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

 

View this post on Instagram

 

A post shared by Malvika Sharma (@malvikasharmaofficial)

 

View this post on Instagram

 

A post shared by Malvika Sharma (@malvikasharmaofficial)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet