iDreamPost
android-app
ios-app

నెటిజన్‌పై మాళవిక ఫైర్‌.. మీకెందుకు అంత తొందర అంటూ..

  • Published Aug 01, 2024 | 11:43 AM Updated Updated Aug 01, 2024 | 11:43 AM

Malavika Mohanan: మాలీవుడ్ హీరోయిన్లు ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.. కొంతమంది స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు. మాలీవుడ్ నుంచి మరో బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Malavika Mohanan: మాలీవుడ్ హీరోయిన్లు ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.. కొంతమంది స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు. మాలీవుడ్ నుంచి మరో బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

  • Published Aug 01, 2024 | 11:43 AMUpdated Aug 01, 2024 | 11:43 AM
నెటిజన్‌పై మాళవిక ఫైర్‌.. మీకెందుకు అంత తొందర అంటూ..

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీల రక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు సెలబ్రెటీలపై వచ్చే రూమర్లు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వెంటనే వాటిపై ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇస్తుంటారు. సోషల్ మాధ్యమాలు వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు తమ అభిమానులకు బాగా దగ్గరవుతున్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా పలు సోషల్ మాధ్యమాల ద్వారా చిట్ చాట్ లో పాల్గొంటూ తమ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ చిట్ చాట్ చేస్తున్న సమయంలో నెటిజన్ వేసిన ప్రశ్నకు ఘాటైన రిప్లై ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల టాలీవుడ్ లోకి మాలీవుడ్ భామలు వరుసగా ఎంట్రీ ఇస్తున్నారు. మాలీవుడ్ లో తన అందం, అభినయంతో కుర్రాళ్ల మనసు దోచిన హీరోయిన్ మాళవిక మోహన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తెలుగు ప్రేక్షకులకు పలు డబ్బింగ్ సినిమాల ద్వారా మంచి పరిచయం అయ్యింది. త్వరలోనే నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పా రంజీత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్’ మూవీలో నటించింది. త్వరలో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీ్ కాగా.. అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీలో మాళవిక డీ గ్లామర్ రోల్ లో కనిపించబోతుంది.

మాళవిక మోణ్ తన అభిమానులతో ఆస్క్ మాళవిక అనే సెషన్ నిర్వహించింది. ఇందులో చాలా మంది ఫ్యాన్స్ ఆమెను రక రకాల ప్రశ్నలు అడిగారు. సినిమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం గురించిన వివరాలు కూడా వెల్లడించారు. అదే సమయంలో ఓ నెటిజన్ మాళవిక పెళ్లి ప్రస్తావన తీసుకువస్తూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు.. ఆ శుభవార్త ఎప్పుడు చెబుతారు అంటూ పోస్ట్ చేశాడు. దీంతో మాళవిక స్పందిస్తూ.. నా పెళ్లి చూడాలని మీకు ఎందుకు అంత తొందర? అంటూ కాస్త గట్టిగానే రిప్లై ఇచ్చినట్లు సమాచారం. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తర్వాత దళపతి విజయ్ నటించి మాస్టర్, ధనుష్ నటించిన మారన్ మూవీస్ తో అలరించింది.

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş