iDreamPost
android-app
ios-app

స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్! వాళ్లతో నటిస్తేనే..

  • Published Jul 08, 2023 | 2:33 PM Updated Updated Jul 08, 2023 | 2:33 PM
  • Published Jul 08, 2023 | 2:33 PMUpdated Jul 08, 2023 | 2:33 PM
స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్! వాళ్లతో నటిస్తేనే..

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్స్ అంతా ఎప్పుడెప్పుడు స్టార్ హీరోల సరసన నటించాలా? అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక తమ కోరికలను సందర్భం వచ్చినప్పుడు బయటపెట్టి వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ సైతం తన మనసులో మాటను బయటపెట్టింది. స్టార్ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో మాలీవుడ్ భామల హవా కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది కూడా కేరళ కుట్టి కావడం విశేషం.

మాళవికా మోహన్.. ప్రముఖ మాలీవుడ్ సీనియర్ కెమెరా మెన్ మోహన్ వారసురాలిగా 2013లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత హిందీ, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ.. బిజీ హీరోయిన్ గా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తరువాత వరుసగా స్టార్ హీరోలు అయిన విజయ్ తో మాస్టర్, ధనుష్ తో మారన్ చిత్రాల్లో నటించి.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చియాన్ విక్రమ్ సరసన ‘తంగలాన్’ చిత్రంలో నటిస్తోంది.

ఇటీవలే ఓ వేదికపై స్టార్ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ భామ. స్టార్ హీరోలతో జతకడితేనే హీరోయిన్స్ కు పేరొస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక తంగలాన్ సినిమాలో కొత్త మాళవికను చూస్తారని చెప్పుకొచ్చింది. నటిగా ఇప్పటికే ఇండస్ట్రీని ఒక రౌండ్ చుట్టేశానని, ఇక నుంచి చేసే పాత్రలు కూడా మంచి వాటినే ఎంపిక చేసుకుని నటిస్తానని ఈ సందర్భంగా మాళవిక మోహన్ పేర్కొన్నారు. మరి స్టార్ హీరోలతో నటిస్తేనే క్రేజ్ వస్తుందన్న మాళవిక వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş