iDreamPost
android-app
ios-app

భర్త గురించి చెబుతూ ఏడ్చిన మహాలక్ష్మి!

  • Published Dec 12, 2023 | 3:01 PM Updated Updated Dec 12, 2023 | 3:01 PM

ప్రముఖ తమిళ సీరియల్‌ నటి మహా లక్ష్మి సంచలన నిర్ణయం తీసుకున్నారు. భర్త రవీందర్‌ కోసం ఏకంగా తన ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ప్రముఖ తమిళ సీరియల్‌ నటి మహా లక్ష్మి సంచలన నిర్ణయం తీసుకున్నారు. భర్త రవీందర్‌ కోసం ఏకంగా తన ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

  • Published Dec 12, 2023 | 3:01 PMUpdated Dec 12, 2023 | 3:01 PM
భర్త గురించి చెబుతూ ఏడ్చిన మహాలక్ష్మి!

నటి మహాలక్ష్మి తమిళ నిర్మాత రవీందర్‌ గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండవ వివాహం. ఇక, పెళ్లైన నాటినుంచి ఇద్దరూ విపరీతమైన విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీరి పెళ్లి ఫొటోలపై అప్పట్లో భీభత్సమైన ట్రోలింగ్‌ జరిగింది. నెటిజన్స్ ఈ జంటను చూసి అవహేళన చేస్తూ కామెంట్లు పెట్టారు.. పెడుతూనే ఉన్నారు. దానికి కారణం రవీందర్ మితిమీరిన బరువు ఉండటమే. అయితే, మహాలక్ష్మి మాత్రం అందంగా , నాజుగ్గా ఉంటుంది.

దీంతో.. మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లి చేసుకుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా ఎన్నో అవమానాలు, సమస్యలు ఎదురైనా ఈ జంట వాటిని పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎంతో అన్యోన్యంగా జీవిస్తోంది. తాజాగా, మహాలక్ష్మీ తన వ్యక్తిగత జీవితం గురించి, భర్త గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఆ ఇంటర్వ్యూలో మహాలక్ష్మి మాట్లాడుతూ..  ‘‘మా పెళ్లి సందర్భంగా చాలా మంది మా జంటను ట్రోల్స్ చేశారు. కానీ, మేము వాటన్నింటిని పట్టించుకోలేదు.

అలాగే నా భర్త రవీందర్ బరువు ఎక్కువ ఉండటంతో.. ఇక నేనే ఆయన కోసం బరువు పెరగాలని నిర్ణయించుకున్నాను. రవీందర్ బరువు తగ్గాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేదు. కాబట్టి నేనే ఆయన మాదిరిగా బరువు పెరగాలని ప్లాన్ చేస్తున్నా. ఈ క్రమంలోనే.. నేను బరువు పెరిగెందుకు అధికంగా కొవ్వు పదార్థలను కూడా తీసుకుంటున్నాను. అందుకోసం.. అర్ధరాత్రి సమయంలో నేను ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నాను. ఆ సమయంలో నాకు నిద్ర కూడా పోతుంది. ఎలాగైనా నేను కూడా ఆయనలా మారాలి. అప్పుడైనా ఈ ట్రోల్స్ ఆగిపోతాయి అనుకుంటా. రవీందర్ జుట్టు నెరిసిపోవడం చాలా బాధగా ఉందని అన్నారు’’ అని అన్నారు.

కాగా, రవీందర్‌ కొద్దిరోజుల క్రితం ఓ చీటింగ్‌ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లారు. కొన్ని నెలల పాటు జైలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే పుకార్లు కూడా వచ్చాయి. వాటిలో నిజం లేదని మహాలక్ష్మి స్పష్టం చేసింది. రవీందర్‌ ఎక్కడున్నా తనవాడేనని అంది. విడాకుల పుకార్లపై ఆమె స్పందించటంతో వాటికి చెక్‌ పడింది. ఇలా ప్రతీసారి ఏదో ఒక విషయంలో రవీందర్‌-మహాలక్ష్మిల జీవితాలపై నెటిజన్లు అనవసరంగా ట్రోలింగ్స్‌ చేస్తున్నారు. కావాలని రవీందర్‌ బరువు గురించి మాట్లాడుతూ.. హేళన చేస్తున్నారు. మరి, మహాలక్ష్మి భర్త కోసం బరువు పెరగాలని తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom