iDreamPost
android-app
ios-app

Laya: ఆ డైరెక్టర్ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంట పడుతూ: లయ

  • Published May 17, 2024 | 2:30 PM Updated Updated May 17, 2024 | 2:30 PM

అలనాటి అందాల నటి లయ.. తాజాగా ఓ తెలుగు టీవీ షోలో పాల్గొన్నది.. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

అలనాటి అందాల నటి లయ.. తాజాగా ఓ తెలుగు టీవీ షోలో పాల్గొన్నది.. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

  • Published May 17, 2024 | 2:30 PMUpdated May 17, 2024 | 2:30 PM
Laya: ఆ డైరెక్టర్ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంట పడుతూ: లయ

టాలీవుడ్ లో తెలుగమ్మాయిలు చాలా తక్కువ. ఒకరిద్దరూ వచ్చినా వారు హీరోయిన్లుగా రాణించడం చాలా కష్టం. ఇప్పుడంటే వెబ్ సిరిస్ లు వచ్చాయి కాబట్టి కాస్తో కూస్తో అవకాశాలు లభిస్తున్నాయి. కానీ కొన్నాళ్ల క్రితం వరకు పరిస్థితి అంత ఆశాజనకంగా ఏం లేదు. ఈ విషయంలో లయ చాలా లక్కీ అని చెప్పవచ్చు. తెలుగులో వరుస సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తన అందం, నటనతో యువతలోనే కాక.. ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా చేరువయ్యింది. హీరోయిన్ గా చేస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని.. పరిశ్రమకు గుడ్ బై చెప్పింది. ఆమె సినిమాలకు దూరమై ఇప్పటికి 18 ఏళ్లు.

చివరగా.. ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ అనే సినిమాలో అమ్మవారి పాత్రలో కనిపించింది. తర్వాత సినిమాలవైపు కన్నెత్తి చూడలేదు. అమెరికాలో సెటిలైన ఈమె అక్కడ నాలుగేళ్లపాటు ఐటీ ఉద్యోగం చేసింది. తర్వాత అది వదిలేసి డ్యాన్స్‌ స్కూల్‌ పెట్టింది. కోవిడ్‌ తర్వాత దాన్ని కూడా మానేసి సోషల్‌ మీడియా మీద కాన్సన్ట్రేషన్ చేసింది. వీడియోలు, ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో ఫుల్లు బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా లయ ఓ టీవీ షోలో కనిపించింది. ఈ సందర్భంగా ఆసక్తికర విశయాలు వెల్లడించింది. తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను కూడా వివరించింది. ఆ వివరాలు..

అందుకే ఇండియాకు వచ్చాను..

తాజాగా ఓ షోలో పాల్గొన్న లయ తన జీవితంలో చోటు చేసుకున్న ఎన్నో విషయాల గురించి మాట్లాడింది. ‘నేను అమెరికా వెళ్లిపోయాక నా గురించి చాలా తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. అమెరికాలో నేను ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాను అని.. రోడ్డున పడ్డానని, అడుక్కుతింటున్నానని, ఇంకా ఎన్నో వదంతులు సృష్టించారు. అవి గుర్తు చేసుకున్నప్పుడల్లా బాధేస్తుంది. ఇప్పుడు నేను ఇండియాకు రావడానికి ప్రధాన కారణం.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. నితిన్‌ ‘తమ్ముడు’ సినిమాలో నటిస్తున్నాను. అందుకే ఇండియాకు వచ్చేశాను’ అని చెప్పుకొచ్చింది.

నన్ను ఫాలో అవుతూ..

అలాగే తన జీవితంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని వివరించింది లయ. ‘ఒకసారి పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న డైరెక్టర్‌ ఒకరు నన్ను ఫాలో అయ్యారు. బేగంపేటలో కారు పార్కింగ్‌ చేసే దగ్గరకు వచ్చి మీరు ఎలా వెళ్తారో చూస్తానని బెదిరించాడు. నేను ఎలాగోలా తప్పించుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయాను. కానీ ఆయన నన్ను ఫాలో అవుతూ అక్కడికీ వచ్చాడు. దాంతో మీరు చంపుతానన్నా నేనేం చేయలేను.. ఇక్కడ ఎవరూ లేరు, మీ ఇష్టం చంపేయండి అన్నాను’ అంటూ లయ ఆనాటి ఇబ్బందికర పరిస్థితిని గుర్తు చేసుకుంది. అయితే ఆ డైరెక్టర్‌ ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş